పూరన్‌ లాగే జోర్డాన్‌ ఫీల్డింగ్‌ విన్యాసం.. 

తాజా వార్తలు

Published : 12/12/2020 01:39 IST

పూరన్‌ లాగే జోర్డాన్‌ ఫీల్డింగ్‌ విన్యాసం.. 

ఇంటర్నెట్‌డెస్క్‌: టీ20 క్రికెట్‌లో మరో మెరుపు ఫీల్డింగ్‌. బిగ్‌బాష్‌ లీగ్‌లో భాగంగా గురువారం రాత్రి సిడ్నీ సిక్సర్స్‌, హోబార్ట్‌ హరీకేన్స్‌ తలపడిన తొలి టీ20లో జోర్డాన్‌ సిల్క్‌ అనే ఆటగాడు ఔరా అనిపించే ఫీల్డింగ్‌ విన్యాసంతో ఆకట్టుకున్నాడు. ఇటీవల యూఏఈలో జరిగిన ఐపీఎల్‌ 13వ సీజన్‌లో రాజస్థాన్‌ బ్యాట్స్‌మన్‌ సంజూ శాంసన్‌ బాదిన ఓ బంతిని.. పంజాబ్‌ ఆటగాడు నికోలస్‌ పూరన్‌ బౌండరీ లైన్‌పై డైవ్‌చేస్తూ ఒడిసిపట్టి.. అతడు నేలకు తాకకముందే రెప్పపాటు క్షణంలో తిరిగి బంతిని మైదానంలోకి వదిలిన సంగతి తెలిసిందే. ఆ ఫీల్డింగ్‌ విన్యాసానికి క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ సైతం ఫిదా అయ్యాడు.

అయితే, అచ్చం అలాంటి మెరుపు ఫీల్డింగ్‌ విన్యాసమే ఇప్పుడు మరోసారి బిగ్‌బాష్‌ లీగ్‌లో చోటుచేసుకుంది. తొలుత టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న సిడ్నీ 12 ఓవర్లకు హరీకేన్స్‌ను 76/4కే కట్టడి చేసింది. ఆపై టిమ్‌ డేవిడ్(58)‌, కొలిన్‌ ఇన్‌గ్రామ్‌(55) అర్ధశతకాలతో రెచ్చిపోవడంతో 20 ఓవర్లు పూర్తయ్యేసరికి 178/8 స్కోర్‌ సాధించింది.

అయితే, స్టీవ్‌ ఒకేఫె వేసిన 15వ ఓవర్‌లో వరుసగా హ్యాట్రిక్‌ ఫోర్లు బాదిన టిమ్‌ నాలుగో బంతికి సింగిల్‌ తీశాడు. అనంతరం కొలిన్‌ ఐదో బంతికి మరో బౌండరీ బాదగా చివరి బంతిని కూడా దాదాపు సిక్సర్‌గా మలిచాడు. బంతి బౌండరీ దాటి నేలకు తాకుతున్న సమయంలో అమాంతం గాల్లోకి డైవ్‌చేసిన జోర్డాన్‌ దాన్ని ఒంటిచేత్తో అందుకొని తిరిగి మైదానంలోకి విసిరాడు. దాంతో సిడ్నీ టీమ్‌కు నాలుగు పరుగులు ఆదా చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతుండగా పలువురు ఆస్ట్రేలియా క్రికెటర్లు జోర్డాన్‌ ఫీల్డింగ్‌ను మెచ్చుకున్నారు. నెటిజన్లు సైతం అతడి విన్యాసం చూసి ఔరా అని ఆశ్చర్యపోతున్నారు. ఇక ఈ  మ్యాచ్‌లో ఛేదనకు దిగిన సిడ్నీ 20 ఓవర్లలో 162/6కే పరిమితమైంది. 16 పరుగుల తేడాతో తొలి మ్యాచ్‌లో ఓటమిపాలైంది. మరోవైపు ఫీల్డింగ్‌లో అదిరిపోయే విన్యాసం చేసిన జోర్డాన్‌ బ్యాటింగ్‌లో తేలిపోయాడు. కేవలం 13 పరుగులే చేశాడు. 
ఇవీ చదవండి..
అదే నా ప్రయాణాన్ని అందంగా మలిచింది: సచిన్‌
సచిన్.. సారా.. సముద్రంలో‌ సరదా..!Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని