
తాజా వార్తలు
ఆసీస్‌కు, మాకు అదే తేడా: కోహ్లీ
ఇంటర్నెట్‌డెస్క్: ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో పేలవ ప్రదర్శన చేశామని, బౌలర్లు సత్తాచాటలేకపోయారని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. సిడ్నీ వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ 51 పరుగుల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. 390 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కోహ్లీసేన 338 పరుగులకే పరిమితమైంది. దీంతో మరో మ్యాచ్ మిగిలుండగానే కోహ్లీసేన 0-2 తేడాతో సిరీస్‌ను కోల్పోయింది. మ్యాచ్ అనంతరం ఓటమిపై కోహ్లీ స్పందించాడు.
‘‘మేం పేలవ ప్రదర్శన చేశాం. బౌలింగ్‌లో సత్తాచాటలేకపోయాం. సరైన ప్రదేశాల్లో బంతులు సంధించడంలో విఫలమయ్యాం. అయితే ఆస్ట్రేలియాకు బలమైన బ్యాటింగ్ లైనప్ ఉంది. ఇక్కడి పరిస్థితులు వారికి బాగా తెలుసు. కాగా, ఛేదనలో మేం 340 పరుగులు సాధించాం. విజయానికి 50 పరుగుల దూరంలో ఆగిపోయాం. కాబట్టి ఛేదన సాఫీగానే సాగిందని చెప్పొచ్చు. ఒకటి, రెండు వికెట్లు పడితే కావాల్సిన రన్‌రేటు 13 నుంచి 16కి చేరుతుంది. అందుకే దూకుడుగా ఆడటానికి ప్రయత్నించాం’’ అని కోహ్లీ అన్నాడు.
మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్, విరాట్ కోహ్లీ క్యాచ్‌లను ఆస్ట్రేలియా ఫీల్డర్లు అద్భుతంగా అందుకున్నారు. దీని గురించి కోహ్లీ మాట్లాడుతూ.. ‘‘ఆసీస్ జట్టు మైదానంలో అవకాశాలను సృష్టించుకొని సాధించింది. అదే మ్యాచ్‌లో తేడా. లేకపోతే మ్యాచ్ పోటాపోటీగా సాగేది. పరిస్థితులకు తగ్గట్లుగా ఆసీస్ బౌలర్లు చక్కగా బౌలింగ్ చేశారు. అయితే 40-41 ఓవర్ల వరకు నేను, కేఎల్ రాహుల్ క్రీజులో ఉండాలనుకున్నాం. ఆఖరి 10 ఓవర్లలో 100 పరుగులు సాధించాల్సిన తరుణంలో హార్దిక్ వచ్చి పని పూర్తిచేస్తాడని భావించాం. కానీ ఆ రెండు క్యాచ్‌లు మ్యాచ్ గమనాన్ని మార్చేశాయి’’ అని కోహ్లీ తెలిపాడు.
మ్యాచ్‌లో ఆరో బౌలర్‌గా హార్దిక్ వేసిన బౌలింగ్ గురించి మాట్లాడుతూ.. ‘‘హార్దిక్ పాండ్య కొన్ని ఓవర్లు బౌలింగ్ చేయడానికి సిద్ధమయ్యాడు. అతడితో ఒకటి లేదా రెండు ఓవర్లు వేయించాలని భావించాం. కానీ అతడు బాగానే బంతులు సంధిస్తుండటంతో మరి కొన్ని ఓవర్లు బౌలింగ్ చేయించాం’’ అని కోహ్లీ అన్నాడు. వెన్నెముక శస్త్రచికిత్స చేయించుకున్న అనంతరం హార్దిక్ బౌలింగ్‌కు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఆసీస్‌తో జరిగిన తొలి వన్డే అనంతరం కూడా బౌలింగ్ చేయడానికి సమయం పడుతుందని హార్దిక్ తెలిపాడు. కానీ నేటి మ్యాచ్‌లో అతడు నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసి 24 పరుగులే ఇచ్చి ఒక్క వికెట్ సాధించాడు. కాగా, మూడు వన్డేల సిరీస్‌లో కాన్బెర్రా వేదికగా నామమాత్రపు చివరి మ్యాచ్ బుధవారం జరగనుంది.