close

తాజా వార్తలు

టీమిండియా లక్ష్యం 208

హైదరాబాద్‌: భారత్‌తో జరిగిన తొలి టీ20లో విండీస్‌ భారీ స్కోరు నమోదు చేసింది. ఆదిలోనే సిమ్మన్స్‌(2) వికెట్‌ కోల్పోయినా మరో ఓపెనర్ ఎ‌విన్‌ లూయిస్‌ (40; 17 బంతుల్లో, 3x4, 4x6).. బ్రాండన్‌ కింగ్‌ (31; 23 బంతుల్లో 3x4, 1x6)తో కలిసి జట్టును ఆదుకున్నాడు. వీరిద్దరూ ఔటయ్యాక హెట్‌మెయిర్‌ (56; 41 బంతుల్లో 2x4, 4x6), కెప్టెన్‌ కీరన్‌ పొలార్డ్‌ (37; 19 బంతుల్లో 1x4, 4x6) ధాటిగా ఆడి భారీ స్కోరుకు బాటు వేశారు. చివర్లో జేసన్‌ హోల్డర్‌(24; 9 బంతుల్లో 1x4, 2x6), దినేశ్‌ రామ్‌దిన్‌(11; 7 బంతుల్లో 1x4) చెలరేగడంతో ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. భారత బౌలర్లలో చాహల్‌ రెండు వికెట్లు తీయగా.. వాషింగ్టన్‌ సుందర్‌, దీపక్‌ చాహర్‌, రవీంద్ర జడేజా తలో వికెట్‌ తీశారు.

 


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.