close

తాజా వార్తలు

Published : 24/11/2020 01:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సూర్యను తప్పించడానికి ఏ కారణం లేదు..

ఇంటర్నెట్‌డెస్క్‌: సుదీర్ఘమైన ఆస్ట్రేలియా పర్యటనలో ముంబయి ఇండియన్స్‌ బ్యాట్స్‌మన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ కచ్చితంగా ఉండాల్సిన ఆటగాడని వెస్టిండీస్‌ దిగ్గజం బ్రయన్‌ లారా అభిప్రాయపడ్డాడు. తాజాగా క్రికెట్‌ కనెక్టెడ్‌ కార్యక్రమంలో మాట్లాడిన మాజీ క్రికెటర్‌ ఈ యువ బ్యాట్స్‌మన్‌ను ప్రశంసలతో ముంచెత్తాడు. అతడో క్లాస్‌ ప్లేయర్‌ అని, ఆటగాళ్ల ఎంపికలో తాను పరుగులు మాత్రమే చూడనని చెప్పాడు. వాళ్ల నైపుణ్యాలు, ఒత్తిడిలో రాణించే సత్తా, బ్యాటింగ్‌ ఆర్డర్‌లో వచ్చే స్థానాలను బట్టి ఆటగాళ్లను అంచనా వేస్తానన్నాడు. ఈ నేపథ్యంలో ముంబయి బ్యాట్స్‌మన్‌ అద్భుతమైన ఆటగాడని పేర్కొన్నాడు. 

రోహిత్‌, డికాక్‌ తర్వాత సూర్య మూడో నంబర్‌ ఆటగాడిగా బరిలోకి దిగుతాడు. వాళ్లు ఒత్తిడిలో ఉన్నప్పుడు బ్యాటింగ్‌ చేస్తాడు. మూడో స్థానమంటే ఎంతో కీలకం. ఏ జట్టులోనైనా ఆ స్థానంలో ఆడే ఆటగాడు ఎంతో ప్రతిభగల సమర్థుడు. సూర్య కూడా అలాంటి వాడే. ఎంతో నమ్మకమైన ఆటగాడు. ఇక ముంబయి జట్టులో ఆ స్థానానికి అతడు సరైన బ్యాట్స్‌మన్‌. ఆస్ట్రేలియా పర్యటనకు అతడిని ఎందుకు ఎంపిక చేయలేదో ఏ కారణాలు కనిపించడం లేదు’ అని లారా వివరించాడు. ఇదిలా ఉండగా, సూర్య గత మూడు సీజన్లలో ఈ టోర్నీలో నిలకడగా రాణిస్తున్నాడు. అలాగే దేశవాళీ క్రికెట్‌లోనూ అత్యధిక పరుగులు సాధిస్తున్నాడు. దీంతో ఆస్ట్రేలియా పర్యటనలో తనని ఎంపిక చేస్తారని ఎంతో ఆశించాడు. కానీ సెలెక్టర్లు అతడికి మొండి చేయి చూపించడంతో నిరాశ చెందాడు. ఈ క్రమంలోనే 13వ సీజన్‌ ఆఖర్లో రెచ్చిపోయాడు. కీలక మ్యాచ్‌ల్లో ఆదుకొని రోహిత్‌సేన ఐదోసారి టైటిల్‌ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. 


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన