
తాజా వార్తలు
సచిన్ తెందూల్కర్‌కు సాయం చేసిన ఆటో డ్రైవర్
వీడియో పంచుకున్న లిటిల్‌మాస్టర్
ఇంటర్నెట్‌డెస్క్: క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్‌కు ఓ ఆటో డ్రైవర్ సాయం చేశాడు. ఈ ఘటన ఈ ఏడాది జనవరిలో జరిగినా అదిప్పుడు వెలుగులోకి వచ్చింది. సచిన్ బుధవారం తన సామాజిక మాధ్యమాల్లో ఓ వీడియోను పంచుకొని ఆ విషయాన్ని వెల్లడించాడు. అసలేం జరిగిందంటే.. జనవరిలో లిటిల్ మాస్టర్ ముంబయిలోని సబర్బన్ వీధుల్లో తన కారులో ప్రయాణిస్తూ ప్రధాన రహదారికి చేరుకునే మార్గాన్ని మర్చిపోయాడు. అలాంటి పరిస్థితుల్లో పక్కనే వెళ్తున్న ఓ ఆటో డ్రైవర్ సచిన్ పరిస్థితిని తెలుసుకొని సాయం చేశాడు. ప్రధాన రోడ్డుకు ఎలా వెళ్లాలనే వివరాల్ని పేర్కొన్నాడు. దాంతో లిటిల్ మాస్టర్ ఆ రోడ్డుపైకి చేరుకున్నాక ఆ ఆటోడ్రైవర్ని కలిసి మాట్లాడాడు. అతడికి షేక్ హ్యాండ్ ఇవ్వడమే కాకుండా ఒక సెల్ఫీ తీసుకునే అవకాశాన్ని కల్పించాడు.
ఆ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్న సచిన్ ఇలా పేర్కొన్నాడు. ‘కొద్ది నెలలుగా నెలకొన్న విపత్కర పరిస్థితుల్లో టెక్నాలజీ మనకెంత ఉపయోగపడుతుందో మనం చూస్తున్నాం. కానీ, మనుషుల సాయానికి మించింది ఏదీ లేదు. మనమంతా ఇప్పుడు అలాంటి పరిస్థితులను కోల్పోయాం’ అంటూ కరోనాను ఉద్దేశించి వివరించాడు. తనకు సాయం చేసిన ఆటో డ్రైవర్ పేరు మంగేశ్ అని, అతడితో మరాఠీలో మాట్లాడిన వీడియోను సచిన్ అభిమానులతో పంచుకున్నాడు. కాగా, లిటిల్ మాస్టర్ సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటాడనే విషయం తెలిసిందే. అప్పుడప్పుడూ తన ఫొటోలు, వీడియోలను పంచుకుంటూ అభిమానులను అలరిస్తుంటాడు. ఇటీవల తన చిరకాల మిత్రుడు, వెస్టిండీస్ మాజీ క్రికెటర్ బ్రయన్లారాతో కలిసి గోల్ఫ్ ఆడిన వీడియోను పంచుకున్నాడు.
స్పోర్ట్స్
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- 2-1 కాదు 2-0!
- బైడెన్.. హారిస్ సీక్రెట్ కోడ్ పేర్లు ఏంటంటే..!
- వైట్‌హౌస్‌లో విచిత్ర పెంపుడు జంతువులు!
- మీ పెద్దొళ్లున్నారే... :సెహ్వాగ్
- ఇక చాలు
- తీరని లోటు మిగిల్చిన ఓటమి: వార్న్
- ఐపీఎల్ 2021: ఏ జట్టులో ఎవరున్నారంటే..
- సాహో భారత్!
- అందరివాడిని
- భారత్-ఎ జట్టుతో వాళ్లు గెలిచారు: పాంటింగ్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
