close

తాజా వార్తలు

ఐపీఎల్‌ సమయంలో ఇది మీకు గుర్తు రాదా?

ముంబయి: భారత దేశవాళీ క్రికెట్‌లో ప్రతిష్ఠాత్మకమైన రంజీ ట్రోఫీ స్థాయిని బీసీసీఐ అధికారులు రోజురోజుకి దిగజారుస్తున్నారని మాజీ ఆటగాడు సునీల్ గావస్కర్ మండిపడ్డాడు. భారత్‌-ఎ జట్టు పేరుతో అగ్రశ్రేణి ఆటగాళ్లను రంజీ ట్రోఫీకి దూరం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘‘గత కొన్నేళ్లుగా ఆటగాళ్లు ఎక్కువ క్రికెట్‌ ఆడుతూ అలిసిపోతున్నారని మనం వింటున్నాం. కానీ ఐపీఎల్‌ సమయంలో వారికి అలసట అనేది ఉండదు. ఇలా చేస్తూ రంజీ ట్రోఫీ స్థాయిని తగ్గిస్తున్నారు. ద్వైపాక్షిక ఒప్పందం ఉంది కాబట్టి కోహ్లీసేన న్యూజిలాండ్‌కు వెళ్లింది. కానీ భారత్-ఎ జట్టు కూడా అదే సమయంలో కివీస్‌కు వెళ్లడానికి కారణాలేంటి? అలా వెళ్లడం వల్ల కీలక ఆటగాళ్లను కోల్పోయి రంజీ ట్రోఫీ కళ తప్పుతుంది. అంతేకాకుండా అండర్‌-19 ప్రపంచకప్‌కు కూడా యువకులు దక్షిణాఫ్రికా వెళ్లడంతో నాకౌట్‌లో కొన్ని జట్లు బలహీనంగా మారుతున్నాయి’’ అని పేర్కొన్నాడు.

‘‘సీనియర్‌ జట్టులో ఎవరైనా గాయపడితే వారి స్థానంలో యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని భారత్‌-ఎ జట్టు కివీస్‌ పర్యటనలో ఉందనే వాదన సరైనది కాదు. ఇతర దేశాలు ఇలా చేయడం లేదు. తమ దేశవాళీ సీజన్‌ సమయంలో ఏ జట్టు కూడా విదేశీ పర్యటనలకు ఆటగాళ్లను పంపించదు. ఐపీఎల్‌ జరిగే సమయంలో ‘ఎ’ జట్టు పర్యటనలు, అండర్-19 సిరీస్‌లు ఏర్పాటు చేస్తారా? భారత క్రికెట్‌ అంటే పాఠశాల, కళాశాల, జూనియర్‌ క్రికెట్‌, కార్పొరేట్‌ క్రికెట్‌, ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌ను కలిపి భారత క్రికెట్‌ అంటారు. వీటికీ అభిమానులు, మీడియా, స్పాన్సర్లు ఉన్నారు. ప్రస్తుతం భారత జట్టు ఇలా ఉందంటే దానికి ఇవన్నీ కారణమే’’ అని గావస్కర్‌ తెలిపాడు. ప్రస్తుతం కోహ్లీసేనతో పాటు భారత్-ఎ జట్టు కూడా న్యూజిలాండ్‌లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.