close

తాజా వార్తలు

పీవీ సింధుకు కాస్త ఊరట

గ్వాంగ్‌ఝౌ: భారత అగ్రశ్రేణి షట్లర్‌ పీవీ సింధుకు కాస్త ఊరట! బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ టూర్ ఫైనల్లో ఆమెకో విజయం దక్కింది. గ్రూప్‌-ఏలో నామమాత్రమైన పోరులో చైనా అమ్మాయి హీ బింగ్జియావోపై 21-19, 21-19తో విజయం సాధించింది. గ్రూప్‌లో మూడో స్థానంలో నిలిచింది. అంతకు ముందు ఆమె వరుసగా రెండు మ్యాచుల్లో ఓడి సెమీస్‌ అవకాశం చేజార్చుకున్న సంగతి తెలిసిందే.

బింగ్జియావోతో పోరులో 9-18తో వెనకబడ్డ సింధు వరుసగా 9 పాయింట్లు సాధించి తొలి గేమ్‌ కైవసం చేసుకోవడం గమనార్హం. ప్రత్యర్థి దూకుడుగా ఆడుతూ 7-3తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. మరింత విజృంభించి 11-6తో ముందుకెళ్లింది. సింధు షటిల్‌ను దూరంగా ఆడుతూ అనవసర తప్పులు చేసింది. ఈ క్రమంలో బింగ్జియావో 19-9తో గేమ్‌ పాయింట్‌ వైపు పయనిస్తుండగా సింధు అద్భుతంగా ప్రతిఘటించింది. వేగంగా ఆడుతూ 18-18తో స్కోరు సమం చేసింది. 19-19 వద్ద తెలివిగా ఆడి రెండు పాయింట్లు చేసి తొలి గేమ్‌ గెలిచింది. అదే ఊపులో రెండో గేమ్‌ను 7-3తో ఆరంభించింది. 11-6తో ముందుకెళ్లింది. ఈ క్రమంలో పుంజుకున్న బింగ్‌ 10-15, 16-18తో సింధును చేరుకుంది. అయితే బ్యాక్‌లైన్‌ వద్ద సింధు కాస్త తెలివిగా ఉండటంతో మూడు పాయింట్లు లభించాయి.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.