close
Array ( ) 1

తాజా వార్తలు

ఎంత ఆడినా కుదురుకోనట్టే ఉంటుంది 

హామిల్టన్‌: సంక్లిష్టమైన బేసిన్‌ రిజర్వు మైదానంలో బ్యాటింగ్‌ చేయడం కష్టమని టీమ్‌ఇండియా ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ (34) అన్నాడు. న్యూజిలాండ్‌ అరంగేట్ర పేసర్‌ జేమీసన్‌ తన కచ్చితత్వంతో ఇబ్బంది పెట్టాడని వెల్లడించాడు. తొలి టెస్టు తొలిరోజు ఆట ముగిసిన తర్వాత అతడు మాట్లాడాడు. తొలిరోజు 122/5తో ఆటను ముగించిన భారత్‌ను గట్టెక్కించేందుకు అగర్వాల్‌, అజింక్య రహానె (38 బ్యాటింగ్‌) ప్రయత్నించారు.

‘పరిమితి మించిన వేగంతో గాలులు వీచడం ఇబ్బంది పెట్టింది. త్వరగా ఇక్కడి పరిస్థితులకు అలవాటు పడాలి. ఒక బ్యాట్స్‌మన్‌గా తొలి రోజు ఈ పిచ్‌పై ఎంతో కష్టం. బేసిన్‌ రిజర్వు పిచ్‌పై ఎంత బాగా ఆడిగా క్రీజులో కుదురుకున్నట్టు అనిపించదు. భోజన విరామం తర్వాతా బ్యాటింగ్‌కు ఇబ్బంది ఎదురైంది. జేమీసన్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. సరైన ప్రాంతాల్లో బంతులు విసిరాడు. బౌన్స్‌ రాబట్టాడు. అతడున్న ఎత్తుకు పిచ్‌ నుంచీ సహకారం లభించింది’ అని మయాంక్‌ అన్నాడు.

‘నా ఏకాగ్రత చెదిరిపోలేదు. నేను ఔటైన విధానానికి బాధపడటం లేదు. ఏదేమైన్పటికీ ఇక్కడి పరిస్థితుల్లో బ్యాటింగ్‌ చేయడం అంత సులభం కాదు. కేవలం ఫుల్లర్‌ బంతులే ప్రభావం చూపాయని చెప్పలేం. నిలకడగా ఆడితే అలాంటి బంతులపై దాడి చేయొచ్చు. ప్రతి నాలుగైదు బంతుల తర్వాత దూకుడుగా ఆడాలి. నేనిక్కడ స్పిన్నర్‌ను ఎదుర్కోలేదు. ఈ పిచ్‌పై మా బౌలర్లు కచ్చితత్వంతో బంతులు విసరాలి. బ్యాటింగ్‌ ఎక్కువసేపు చేస్తే పరుగులు వస్తాయి. రహానె ఆట తీరు బాగుంది. ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నాడు. రిషభ్‌ పంత్‌ అతడికి మద్దతుగా నిలవాలి. మంచి భాగస్వామ్యాలు నిర్మిస్తే మేం కచ్చితంగా భారీ స్కోరు చేయగలం’ అని మయాంక్‌ పేర్కొన్నాడు. ఔటైన ఐదుగురిలో నలుగురు ఫుల్‌ లెంగ్త్‌ బంతులకే ఔటవ్వడం గమనార్హం.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
HITS2020
dr madhu
besttaxfiler
Saket Pranamam
VITEEE 2020

Panch Pataka

దేవతార్చన