ఎన్నాళ్ల కెన్నాళ్లకు.. యువరాజ్‌ సిక్సర్‌!
close

తాజా వార్తలు

Updated : 13/12/2020 12:17 IST

ఎన్నాళ్ల కెన్నాళ్లకు.. యువరాజ్‌ సిక్సర్‌!

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ శనివారం 39వ పుట్టినరోజు జరుపుకొన్నాడు. ఈ సందర్భంగా అతడికి తోటి క్రికెటర్లు, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. అయితే, నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ప్రస్తుతం రైతులు చేస్తోన్న ఆందోళనలు సద్దుమణగాలని, ప్రభుత్వంతో వారి చర్చలు ఫలప్రదం కావాలని కోరుతూ ఈసారి తన జన్మదిన వేడుకలకు దూరంగా ఉంటున్నట్లు ఒక ప్రకటనలో తెలిపాడు. ఈ నేపథ్యంలోనే శనివారం రాత్రి ఇన్‌స్టాగ్రామ్‌లో మరో వీడియో పంచుకున్న అతడు నెట్స్‌లో తనకిష్టమైన బ్యాటింగ్‌ చేస్తూ కనిపించాడు. 

తానెంతో ప్రేమించే ఆటను పుట్టినరోజు నాడు యువీ నెట్స్‌లో సాధన‌ చేశాడు. బ్యాట్‌పట్టి మళ్లీ షాట్లు ఆడాడు. ఈ సందర్భంగా బౌలర్‌ తలపై నుంచి బాదిన ఓ సిక్సర్‌ వీడియోను స్లోమోషన్‌లో చూపిస్తూ అభిమానులతో పంచుకున్నాడు. ‘కొత్త సంవత్సరంలోకి వెళ్లడం అద్భుతంగా ఉంది. మళ్లీ ఆటలో మునిగిపోవడం సంతోషంగా అనిపిస్తుంది. మనకు ఇష్టమైన వాటికి దూరంగా ఉండటం ఎలా ఉంటుందోనని తెలుసుకోవడం కొన్నిసార్లు చాలా ముఖ్యం. మీ అందరి ప్రేమాభిమానాలు, శుభాకాంక్షలకు ధన్యవాదాలు’ అని పేర్కొన్నాడు. 2000 ఏడాదిలో దాదా కెప్టెన్సీలో భారత జట్టులోకి వచ్చిన స్టార్‌ బ్యాట్స్‌మన్‌ సుదీర్ఘకాలం రాణించాడు. తన బ్యాటింగ్‌తో ఎన్నో మధుర విజయాలు అందించాడు. టీమ్‌ఇండియా 2007లో టీ20 ప్రపంచకప్‌, 2011లో రెండోసారి వన్డే ప్రపంచకప్‌ గెలవడంలో ముఖ్యభూమిక పోషించాడు. గతేడాది వన్డే ప్రపంచకప్‌ జట్టుకు ఎంపిక చేయకపోవడంతో ఆటకు వీడ్కోలు పలికాడు. ఇక అప్పటి నుంచి అతడు బ్యాటింగ్‌ చేసింది అభిమానులు చూడలేదు. దీంతో ఈ వీడియోకు మంచి స్పందన వచ్చింది. పోస్టు చేసిన 12 గంటల్లోనే 12 వేల మందికిపైగా లైక్‌కొట్టారు.

ఇవీ చదవండి..

మయాంక్‌.. విరాట్‌ సాయంతో!

శతక్కొట్టారుTags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని