close

తాజా వార్తలు

చాహల్‌.. నిన్ను ఏమన్నానో తెలుసుగా: గప్తిల్‌

హామిల్టన్‌: ఇటీవల టీమిండియా స్పిన్నర్‌ యుజువేంద్ర చాహల్, న్యూజిలాండ్‌ ఓపెనర్‌ మార్టిన్‌ గప్తిల్‌ మధ్య జరిగిన సంభాషణ నెట్టింట్లో వైరల్‌గా మారింది. దీనిలో చాహల్‌ను ఉద్దేశిస్తూ గప్తిల్ హిందీలో ఓ అసభ్యకరమైన పదాన్ని అన్నాడు. అయితే గప్తిల్‌కు హిందీ రాకపోవడంతో చాహల్ సరదాగా తీసుకున్నాడు. కానీ ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుండటంతో గప్తిల్‌ వద్దకు చాహల్ వెళ్లి దీని గురించి చర్చించాడు. ‘‘గత రాత్రి నాతో ఏమన్నావ్‌?’’ అని గప్తిల్‌ను చాహల్ అడిగాడు. దీనికి గప్తిల్ ‘‘నిన్ను ఏమన్నానో నీకు తెలుసుగా’’ అని నవ్వుతూ సమాధానిమిచ్చి ఆ విషయాన్ని అక్కడితో ముగించాడు. ఈ వీడియోను చాహల్ తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో పోస్ట్‌ చేశాడు. ప్రస్తుతం ఇది సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది.

హామిల్టన్‌ వేదికగా న్యూజిలాండ్‌తో భారత్‌ నేడు మూడో మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ కైవసం చేసుకోవాలని కోహ్లీసేన పట్టుదలతో ఉంది. మరోవైపు కివీస్ టీమిండియాను ప్రతిఘటించి సిరీస్‌ ఆశలను సజీవంగా ఉంచుకోవాలని భావిస్తోంది. అయిదు టీ20ల సిరీస్‌లో భారత్‌ 2-0తో ఆధిక్యంలో ఉన్న సంగతి తెలిసిందే.

ఇదీ చదవండి

అయ్యో పంత్‌.. ఎలా వచ్చావో అలానే!


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.