WTC Final: ఫైనల్ భారత్‌వైపు తిరగొచ్చు..
close

తాజా వార్తలు

Updated : 22/06/2021 01:27 IST

WTC Final: ఫైనల్ భారత్‌వైపు తిరగొచ్చు..

కివీస్‌ మెరుగ్గా కనిపిస్తున్నా.. : ఆకాశ్‌చోప్రా

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌లో న్యూజిలాండ్ ప్రస్తుతం మెరుగ్గా కనిపిస్తున్నా పరిస్థితులు మారుతాయని టీమ్‌ఇండియా మాజీ బ్యాట్స్‌మన్‌, క్రికెట్‌ వ్యాఖ్యాత ఆకాశ్‌చోప్రా అభిప్రాయపడ్డాడు. చాలా త్వరగా ఈ మ్యాచ్‌ భారత్‌వైపు తిరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. తాజాగా ఓ క్రీడాఛానెల్‌తో మాట్లాడిన అతడు ఇలా చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచ్‌ ఇప్పటికీ ఇరు జట్లకు సమానంగా ఉందని, త్వరలోనే పరిస్థితులు భారత్‌కు అనుకూలిస్తాయని చెప్పాడు.

మరోవైపు న్యూజిలాండ్‌ ప్రస్తుతం టీమ్‌ఇండియా కన్నా తొలి ఇన్నింగ్స్‌లో 116 పరుగుల వెనుకంజలో ఉన్న సంగతి తెలిసిందే. చేతిలో ఇంకా ఎనిమిది వికెట్లు ఉండటంతో విలియమ్సన్‌ టీమ్‌ మెరుగైన స్థితిలో కనిపిస్తోంది. అయితే, తనకు మాత్రం అలా కనిపించడం లేదని చోప్రా అన్నాడు. ఎందుకంటే ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ పైచేయి సాధించాలంటే ఇక్కడి నుంచి ఆ జట్టు ఇంకో 216 పరుగులు చేయాలన్నాడు. అలా కాకుండా మరో 150 పరుగులకే ఆలౌటైతే కివీస్‌ ఆధిక్యంలో ఉండదని అభిప్రాయపడ్డాడు. అలాగే ఒకానొక స్థితిలో భారత్‌ 146/3 స్కోరుతో మెరుగ్గా ఉందని, అప్పటికి ఇద్దరు మేటి ఆటగాళ్లు క్రీజులో ఉన్నారని గుర్తుచేశాడు. అయినా, చివరికి 217 పరుగులకే ఆలౌటయ్యారన్నాడు.

ఈ నేపథ్యంలోనే ఇరు జట్ల ఆటగాళ్లను పోల్చి చూసినా కోహ్లీసేనే బలంగా ఉందని మాజీ ఓపెనర్‌ చెప్పుకొచ్చాడు. కివీస్‌ జట్టులో బాగా ఆడేవారున్నా.. టీమ్‌ఇండియా ఆత్మవిశ్వాసమే జట్టును మెరుగైన స్థితిలో నిలుపుతుందని చెప్పాడు. భారత జట్టులో ఇద్దరు స్పిన్నర్లు ఉన్నారని.. అశ్విన్‌, జడేజాపై నమ్మకంతోనే తుదిజట్టులోకి తీసుకున్నారని చోప్రా వివరించాడు. గతంలోనూ క్లిష్ట పరిస్థితుల నుంచి కోలుకొని బాగా ఆడరని, ఇప్పుడు కూడా అలాగే ఆడతారని చోప్రా పేర్కొన్నాడు. కాగా, టీమ్‌ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 217 పరుగులకు ఆలౌటవ్వగా న్యూజిలాండ్‌ మూడో రోజు ఆట నిలిచిపోయేసరికి 101/2తో నిలిచింది. క్రీజులో విలియమ్సన్‌(12), రాస్‌ టేలర్‌ ఉన్నారు. మరోవైపు సోమవారం నాలుగో రోజు ఆట వర్షం కారణంగా రద్దైంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని