Pakistan: ‘అబ్దుల్‌ రజాక్‌.. ఇది సిగ్గుచేటు’ 

తాజా వార్తలు

Published : 16/07/2021 23:48 IST

Pakistan: ‘అబ్దుల్‌ రజాక్‌.. ఇది సిగ్గుచేటు’ 

పాక్‌ మాజీ క్రికెటర్‌పై నెటిజన్ల మండిపాటు

ఇంటర్నెట్‌డెస్క్‌: పాకిస్థాన్‌ మాజీ ఆల్‌రౌండర్‌ అబ్దుల్‌ రజాక్‌ ఓ వివాదంలో ఇరుక్కున్నారు. పాక్‌ మహిళా క్రికెటర్‌ను ఉద్దేశించి అతడు చేసిన వ్యాఖ్యలపై సోషల్‌ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక జాతీయ జట్టుకు ఆడిన ఆటగాడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. రజాక్‌ గతంలోనూ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసినా ఈసారి అవి శ్రుతి మించాయని మండిపడుతున్నారు.

ఇటీవల ఓ పాక్‌ ఛానెల్‌ నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో రజాక్‌తో పాటు ఆ దేశ మహిళా జట్టు ఆల్‌రౌండర్‌ నిదా దార్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రీడల్లో స్త్రీల ప్రాముఖ్యతపై ప్రస్తావన రాగా.. రజాక్‌ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు. ‘మహిళలు క్రికెటర్లుగా మారితే.. పురుషులతో సమానంగా ఉండాలనుకుంటారు. లేదా ఇంకా మెరుగ్గా ఉండాలనుకుంటారు. పురుషులే కాకుండా తామూ బాగా ఆడతామని నిరూపించుకోవాలని చూస్తారు. దాంతో వాళ్లు అత్యుత్తమ క్రీడాకారులుగా ఎదిగేసరికి వివాహం చేసుకోవాలనే ఆశ సన్నగిల్లుతుంది. ఇప్పుడు నిదాకు షేక్‌ హ్యాండిస్తే మహిళ అనే భావన కూడా కలగదు’ అని రజాక్‌ అన్నాడు.

ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో నెటిజన్లు స్పందిస్తున్నారు. రజాక్ ఆమెకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నారు. అతడు పాక్‌ జట్టుకు అత్యున్నత స్థాయిలో ఆడినా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దారుణమని కామెంట్లు పెడుతున్నారు. ఆ కార్యక్రమంలో పాల్గొన్నవారంతా సిగ్గుపడాలని మండిపడుతున్నారు. ఈ విషయంపై రజాక్‌ ఇంతవరకూ స్పందించలేదు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని