T20 World Cup: నా ఇంగ్లీష్ ఐదు నిమిషాల్లోనే ఖతం: నబీ

తాజా వార్తలు

Published : 28/10/2021 01:19 IST

T20 World Cup: నా ఇంగ్లీష్ ఐదు నిమిషాల్లోనే ఖతం: నబీ

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా అఫ్గాన్‌- స్కాట్లాండ్‌ మంగళవారం జరిగిన మ్యాచ్‌ అనంతరం సన్నివేశం చోటుచేసుకుంది. తనకు వచ్చీరాని ఇంగ్లీష్‌తో ఈ మీడియాను ఎదుర్కోవాలో అంటూ అఫ్గాన్‌ కెప్టెన్‌ నబీ చేసిన కామెంట్స్‌ నవ్వులు పూయిస్తున్నాయి. స్కాట్లాండ్‌పై విజయం సాధించిన అనంతరం నబీ మీడియాతో మాట్లాడేందుకు వచ్చాడు. సాధారణంగా ప్రతి మ్యాచ్‌ తర్వాత సారథులు వచ్చి విలేకర్లతో మాట్లాడటం మామూలే. అయితే ఇక్కడే ఓ తమాషా సన్నివేశం జరిగింది. నబీకి ధారాళంగా ఇంగ్లీష్‌ మాట్లాడటం రాదు. ఉర్దూను అనర్గళంగా మాట్లాడగలడు. సాధారణంగా అంతర్జాతీయ మీడియా ప్రతినిధులు ఆంగ్లంలోనే ప్రశ్నలు అడుగుతుంటారు. అయితే ప్రెస్ కాన్ఫరెన్స్‌ మొదలవ్వడానికి వేచి ఉన్న సమయంలో నబీ మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.

వైరల్‌గా మారిన ఆ వీడియోలో నబీ వేరే వ్యక్తి (మీడియా మేనేజర్‌)తో మాట్లాడుతున్నాడు. అందులో ఏముందంటే.. ‘‘మీడియాను ఎదుర్కోవడం చాలా కష్టమైన పని బ్రదర్. నిజంగా చెబుతున్నా. ఇంతకీ ఎన్ని ప్రశ్నలు ఉన్నాయి?’’ అని నబీ అడుగుతాడు. అవతలి వ్యక్తి నుంచి వచ్చిన సమాధానానికి స్పందిస్తూ.. ‘ఐదు నిమిషాల్లో నా ఇంగ్లీష్ అయిపోతుంది’ అని నబీ నవ్వుతూ బదులిచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని