MS Dhoni: ధోనీకి బ్యాటింగ్‌ రాదనుకున్నా!

తాజా వార్తలు

Published : 08/06/2021 11:05 IST

MS Dhoni: ధోనీకి బ్యాటింగ్‌ రాదనుకున్నా!

దక్షిణాఫ్రికా పేసర్‌ ఆన్రిచ్‌ నార్జ్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: దిగ్గజ క్రికెటర్‌ ఎంఎస్‌ ధోనీకి బ్యాటింగ్‌ చేయడం రాదనుకున్నానని దక్షిణాఫ్రికా స్పీడ్‌స్టర్‌ ఆన్రిచ్‌ నార్జ్‌ అన్నాడు. అప్పటికి మహీ గురించి తనకు పూర్తిగా తెలియదని పేర్కొన్నాడు. క్రీజులో పాదాలను సరిగ్గా కదిలించకపోవడంతో అలా భావించానని తెలిపాడు. అప్పుడు తాను అండర్‌-16 విభాగంలో ఆడుతున్నానని వివరించాడు.

నార్జ్‌ చెప్పిన ఈ సంగతి 2010 నాటిది. ఆ ఏడాది దక్షిణాఫ్రికాలో ఛాంపియన్స్‌ టీ20 లీగ్‌ జరిగింది. చెన్నై సూపర్‌కింగ్స్‌ అందులో ఆడింది. అప్పుడు సీఎస్‌కేకు 16 ఏళ్ల నార్జ్‌ నెట్స్‌లో బౌలింగ్‌ చేశాడు. ప్రస్తుతం అతడు దిల్లీ క్యాపిటల్స్‌కు ఆడుతున్న సంగతి తెలిసిందే.

‘అప్పట్లో నేను పెద్దవాడిని కాను. కాబట్టి ఎవరికీ భయపడేవాడిని కాదు. నేనప్పుడు అండర్‌-16, అండర్‌-19కి ఆడుతున్నాను. నా వేగమూ ఎక్కువగా ఉండేది కాదు. ఎంఎస్‌ ధోనీకి నెట్స్‌లో బౌలింగ్‌ చేయడం నాకు గుర్తుంది. నిజాయతీగా చెప్పాలంటే అతడు బ్యాటింగ్‌ చేసేలా కనిపించలేదు. అతడు ధోనీ అనీ తెలియదు. పాదాలు కదపకుండానే బంతుల్ని ఆడాడు. ఆ తర్వాతే అతడెవరో, ఎంత మంచి వ్యక్తో అర్థమైంది’ అని నార్జ్‌ తెలిపాడు. ‘నేను అబద్ధం చెప్పడం లేదు. నిజంగానే నాకలా అనిపించింది’ అని పేర్కొన్నాడు.

ప్రస్తుత నార్జ్‌ వెస్టిండీస్‌లో ఉన్నాడు. దక్షిణాఫ్రికా జట్టు ఇప్పుడు అక్కడే పర్యటిస్తోంది. రెండేళ్లుగా అతడు ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో అదరగొడుతున్నాడు. అత్యంత వేగంగా బంతులేశాడు. గతేడాది 22 వికెట్లు తీసి దిల్లీ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. కాగా ఆ ఏడాది చెన్నై ఛాంపియన్స్‌ లీగ్‌ ట్రోఫీ గెలవడం గమనార్హం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని