India vs Srilanka: కేసులొస్తే మరో జట్టుతో తలపడనున్న గబ్బర్‌ సేన

తాజా వార్తలు

Published : 10/07/2021 13:50 IST

India vs Srilanka: కేసులొస్తే మరో జట్టుతో తలపడనున్న గబ్బర్‌ సేన

ఇంటర్నెట్‌ డెస్క్‌: శ్రీలంక క్రికెట్లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బృందంలో మరింత మందికి వైరస్‌ సోకితే ఏం చేయాలన్న దానిపై ఎస్‌ఎల్‌సీ దృష్టిపెట్టింది. ఇంగ్లాండ్‌ తరహాలో ప్రత్యామ్నాయ జట్టును టీమ్‌ఇండియాతో సిరీసులో బరిలోకి దింపాలని యోచిస్తోంది. ఇప్పటికే ఆ దిశగా ప్రయత్నాలు మొదలయ్యాయని తెలిసింది.

ఇంగ్లాండ్‌ నుంచి తిరిగొచ్చిన శ్రీలంక బృందంలో బ్యాటింగ్‌ కోచ్‌ గ్రాంట్‌ ఫ్లవర్‌, డేటా అనలిస్టు జీటీ నిరోషన్‌కు కరోనా వచ్చింది. దీంతో శుక్రవారం సేకరించిన ఆర్‌టీపీసీఆర్‌ నమూనాలపై సందిగ్ధం నెలకొంది. ఆటగాళ్లలో ఎవరికైనా పాజిటివ్‌ వస్తుందా అన్న భయం పట్టుకుంది. జులై 13 నుంచి ఆరంభమవ్వాల్సిన వన్డే సిరీసును మరో నాలుగు రోజులు వెనక్కి జరిపింది. 17వ తేదీ నుంచి మొదలు పెడతామని లంక బోర్డు తెలిపింది.

‘ఇప్పటి వరకు చేసిన పరీక్షల్లో జట్టులోని ఆటగాళ్లందరికీ నెగెటివ్‌ వచ్చింది. బ్యాటింగ్‌  కోచ్‌ గ్రాంట్‌ ఫ్లవర్‌, డేటా అనలిస్టు నిరోషన్‌కు పాజిటివ్‌ వచ్చిన సంగతిని దృష్టిలో పెట్టుకున్నాం. షెడ్యూలును మార్చబోతున్నాం. తొలి వన్డే జరిగే జులై 17 నాటికి మరిన్ని కేసులు వస్తే ప్రత్యామ్నాయ జట్టును బరిలోకి దించుతాం. ఇప్పటికే వారు దంబుల్లా, కొలంబోలో బయో బుడగలో ఉన్నారు. సాధన చేస్తున్నారు’ అని శ్రీలంక క్రికెట్‌ బోర్డు కార్యదర్శి మోహన డిసిల్వా అన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని