వారిద్దరూ సమన్వయం చేసుకొని ఆడాలి:ఓజా
close

తాజా వార్తలు

Published : 12/05/2021 00:58 IST

 వారిద్దరూ సమన్వయం చేసుకొని ఆడాలి:ఓజా

ఇంటర్నెట్ డెస్క్‌: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌ షిప్‌తో పాటు తర్వాత ఇంగ్లాండ్‌తో జరిగే ఐదు టెస్టుల సిరీస్‌లో రవిచంద్రన్‌ అశ్విన్, రవీంద్ర జడేజాలకు తుది జట్టులో అవకాశం దక్కితే ఇద్దరూ సమన్వయం చేసుకుని ఆడాలని భారత మాజీ  స్పిన్నర్‌ ప్రజ్ఞాన్‌ ఓజా సూచించాడు.  అనుభవజ్ఞులైన ఈ ఇద్దరు ఆటగాళ్లు ఎలాంటి వికెట్‌మీదనైనా వికెట్లు తీయడంతో పాటు పరుగులు రాబట్టి జట్టుకు విజయాలనందించగలరని పేర్కొన్నాడు. టెస్టు క్రికెట్‌లో కొన్నాళ్లుగా ఈ స్పిన్ ద్వయం ప్రత్యర్థి జట్ల బ్యాటింగ్‌ లైనప్‌ను దెబ్బతీయడంలో కీలకపాత్ర పోషిస్తోందని పేర్కొన్నాడు.
 

‘రవిచంద్రన్‌ అశ్విన్, రవీంద్ర జడేజా ఇద్దరు ఆడాలి. ఇద్దరూ బ్యాటింగ్ చేయడంతోపాటు ఎలాంటి పిచ్‌లమీదనైనా మంచి బౌలింగ్ ప్రదర్శన చేస్తారు. జడేజాకు దేశవాళీ క్రికెట్‌లో మంచి రికార్డు ఉంది. అతడు మూడు ట్రిపుల్ సెంచరీలు చేశాడు. అశ్విన్‌ కూడా పలు అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో శతకాలు బాదాడు. ఈ ఇద్దరి స్పిన్నర్లకు తుది జట్టులో ఆడే అవకాశం వస్తే సమన్వయం చేసుకుని ఆడాలి. అనుభవజ్ఞులైన వీరిద్దరూ ఎలాంటి  వికెట్‌మీదనైనా విజయాలను అందించగల సమర్థులు’ అని ఓజా అన్నాడు.

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని