అశ్విన్‌ రికార్డుల పరంపర
close

తాజా వార్తలు

Updated : 15/02/2021 07:10 IST

అశ్విన్‌ రికార్డుల పరంపర

ఇంటర్నెట్‌డెస్క్‌: చెపాక్‌ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో అశ్విన్‌ ధాటికి ఇంగ్లాండ్‌ 134 పరుగులకే కుప్పకూలింది. యాష్‌ అయిదు వికెట్లతో సత్తాచాటాడు. అయితే, సుదీర్ఘ ఫార్మాట్‌లో అతడు పలు రికార్డులు బద్దలు కొట్టాడు. ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్‌ను 200 సార్లు ఔట్ చేసిన తొలి బౌలర్‌గా ఘనత సాధించాడు. అతడి 391 టెస్టు వికెట్లలో 200 వికెట్లు లెఫ్టార్మ్‌ బ్యాట్స్‌మెన్‌వే కావడం విశేషం. ఈ క్రమంలోనే ఎడమచేతి వాటంగల బ్యాట్స్‌మెన్‌లో డేవిడ్ వార్నర్‌ అత్యధికంగా పది సార్లు యాష్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. తర్వాత కుక్‌ (9), బెన్‌ స్టోక్స్‌ (9), కొవన్‌ (7), అండర్సన్‌ (7) ఉన్నారు.

అంతేగాక స్వదేశంలో అత్యధిక సార్లు అయిదు వికెట్లు సాధించిన నాలుగో బౌలర్‌గా అశ్విన్‌ రికార్డు సాధించాడు. భారత్‌లో 45 టెస్టులు ఆడిన అతడు ఒకే ఇన్నింగ్స్‌లో 23 సార్లు అయిదు వికెట్లు సాధించాడు. అశ్విన్‌ ముందు మురళీథరన్‌ (45), హెరాత్‌ (26), అనిల్‌ కుంబ్లే (25) ఉన్నారు. అయిదో స్థానంలో అండర్సన్‌ (22) ఉన్నాడు. మరోవైపు స్వదేశంలో టెస్టుల్లో ఎక్కువ వికెట్లు సాధించిన రెండో భారత బౌలర్‌గానూ అశ్విన్‌ రికార్డులకెక్కాడు. హర్భజన్‌ సింగ్‌ (265)ను అధిగమించాడు. అగ్రస్థానంలో కుంబ్లే (350) ఉన్నాడు. కాగా, ఆదివారం ఆట ముగిసేసరికి ప్రత్యర్థి జట్టు కంటే భారత్ 249 పరుగుల ఆధిక్యంలో నిలిచిన సంగతి తెలిసిందే.

ఇదీ చదవండి

అ‘స్పిన్’‌ ఉచ్చులో ఇంగ్లాండ్‌ విలవిల


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని