close

తాజా వార్తలు

Published : 26/01/2021 11:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పుజారా అలా చేస్తే.. సగం మీసం గీసుకుంటా

చెన్నై: చెతేశ్వర్‌ పుజారాకు ఆఫ్‌స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ చిత్రమైన సవాలును విసిరాడు. ఇంగ్లాండ్‌తో వచ్చే సిరీస్‌లో ఏ స్పిన్నర్‌ బౌలింగ్‌లోనైనా ముందుకొచ్చి అతడి తలమీదుగా షాట్‌ ఆడితే సగం మీసం గీసుకుంటానని అన్నాడు. తన అధికారిక యూట్యూబ్‌ ఛానల్‌లో భారత బ్యాటింగ్‌ కోచ్‌ విక్రమ్‌ రాఠోర్‌తో మాట్లాడుతూ అశ్విన్‌ ఈ వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో మొయిన్‌ అలీ లేదా ఏ ఇతర స్పిన్నర్‌ బౌలింగ్‌లోనైనా పుజారా ముందుకొచ్చి బౌలర్‌ తలమీదుగా షాట్‌ ఆడితే.. నేను నా సగం మీసం గీసుకుని, మ్యాచ్‌ ఆడతా’’ అని అశ్విన్‌ అన్నాడు. ‘‘ఇది గొప్ప సవాల్‌. ఈ సవాలును పుజారా స్వీకరిస్తాడని ఆశిద్దాం. కానీ అతడు స్వీకరిస్తాడని నేను అనుకోవట్లేదు’’ అని రాఠోర్‌ చెప్పాడు.  

ఇవీ చదవండి..

మరో 30ని. క్రీజులో ఉంటే 3-1గా మారేది‌: పంత్‌

‘పంత్ వ్యూహం’ కోహ్లీదే



Tags :

స్పోర్ట్స్

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని