స్మిత్‌ విషయంలో నన్నెవరూ నమ్మలేదు: అశ్విన్‌
close

తాజా వార్తలు

Published : 25/01/2021 21:20 IST

స్మిత్‌ విషయంలో నన్నెవరూ నమ్మలేదు: అశ్విన్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో స్టీవ్‌స్మిత్‌ను తాను ఔట్‌చేస్తాననే విషయం ఎవరూ నమ్మలేదని టీమ్‌ఇండియా ఆఫ్‌స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ పేర్కొన్నాడు. తాజాగా అతడు మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఈ సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియా ప్రధాన బ్యాట్స్‌మన్‌ను ఎవరు ఔట్‌ చేస్తారనే విషయంపై పెద్దచర్చ జరిగిందని, ఆ సమయంలో ఎవరూ తన పేరును మాత్రం ప్రస్తావించలేదని అశ్విన్‌ చెప్పాడు. ఈ నేపథ్యంలోనే సిరీస్‌ ముగిశాక అందరూ తన గురించి మాట్లాడుకునేలా చేశానని అన్నాడు. 

‘ఈ సిరీస్‌లో నా బౌలింగ్‌ మీద చాలా చర్చ జరిగింది. ఆసీస్‌ స్పిన్నర్‌ నాథన్‌ లైయన్‌తో నన్ను పోల్చారు. అయితే, గత పర్యటనలో అడిలైడ్‌ టెస్టులో నాకు కడుపునొప్పి వేధిస్తున్నా ఆరు వికెట్లు తీశాను. కానీ, మ్యాచ్‌ అయ్యాక లైయన్‌ బౌలింగే బాగుందని అన్నారు. మంచి ప్రదర్శన చేసినా అలా అనేసరికి బాధించింది. దాంతో ఈసారి కూడా నా బౌలింగ్‌పై కచ్చితంగా ఓ కన్నేసి ఉంచుతారని అనుకున్నా. అయితే, ఇప్పుడు లైయన్‌తో కాకుండా స్మిత్‌తో పోల్చాలని అనుకున్నా. లైయన్‌ మంచి స్పిన్నర్‌. అతడంటే గౌరవం ఉంది. కానీ, నేను వేరేది ఆశిస్తున్నా. ఇంతకుముందు స్మిత్‌ ఆస్ట్రేలియాలో స్పిన్‌ బౌలింగ్‌లో ఔటైన దాఖలాలే లేవనే రికార్డు ఉంది. దాన్ని తిరగరాయాలనుకున్నా. ఈ క్రమంలోనే అతడిని ఎవరు ఔట్‌చేస్తారనే విషయంపై చాలా మంది చర్చించారు. కానీ, ఎవరూ నా గురించి ఆలోచించలేదు. చివరికి సిరీస్ పూర్తయ్యాక అంతా నా గురించి మాట్లాడుకునేలా చేశాను’ అని అశ్విన్‌ వివరించాడు. 

కాగా, ఆస్ట్రేలియా పర్యటనలో అశ్విన్‌ బౌలింగ్‌తోనే కాకుండా బ్యాటింగ్‌లోనూ అదరగొట్టాడు. ఈ సిరీస్‌లో మొత్తం 12 వికెట్లు తీసిన అతడు.. స్టీవ్‌స్మిత్‌ను మూడుసార్లు పెవిలియన్‌ పంపాడు. అలాగే సిడ్నీ వేదికగా జరిగిన మూడో టెస్టులో ఆస్ట్రేలియా విజయం సాధించకుండా అడ్డుకొన్నాడు. హనుమ విహారి(23*)తో కలిసి అశ్విన్‌(39*) 42 ఓవర్లకుపైగా బ్యాటింగ్‌ చేసి మ్యాచ్‌ను డ్రాగా ముగించాడు. దాంతో గబ్బా టెస్టుకు ముందు భారత్‌, ఆసీస్‌ చెరో విజయంతో సమానంగా నిలిచాయి. ఇక గబ్బా టెస్టులో అశ్విన్‌ వెన్నునొప్పితో ఆడకపోయినా టీమ్‌ఇండియా అద్భుత విజయం సాధించింది. చివర్లో పంత్‌(89*) చెలరేగడంతో టీమ్‌ఇండియా రెండోసారి చారిత్రక విజయం సాధించింది. 

ఇవీ చదవండి..
ద్రవిడ్‌ నాకూ సాయం చేశాడు: తైబు
ఒకే ఆటగాడు. ఒకే బంతి.. రెండుసార్లు రనౌట్‌ 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని