సచిన్‌, ఆర్పీ, శ్రీనాథ్‌ కన్నా బుమ్రానే ఎక్కువ

తాజా వార్తలు

Published : 05/02/2021 12:51 IST

సచిన్‌, ఆర్పీ, శ్రీనాథ్‌ కన్నా బుమ్రానే ఎక్కువ

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత్‌లో తొలి టెస్టు ఆడడానికి టీమ్‌ఇండియా ప్రధాన పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రాకు మూడేళ్లు పట్టింది. 2018లో దక్షిణాఫ్రికా పర్యటనలో సుదీర్ఘఫార్మాట్‌లో అరంగేట్రం చేసిన అతడు ఎట్టకేలకు స్వదేశంలో తొలి టెస్టు ఆడుతున్నాడు. చెన్నై వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో బుమ్రా తుది జట్టుకి ఎంపికైన సంగతి తెలిసిందే. దీంతో స్వదేశంలో తొలి టెస్టు ఆడకముందే విదేశాల్లో అత్యధికంగా 17 టెస్టులు ఆడిన వెస్టిండీస్‌ బ్యాట్స్‌మన్‌ డారెన్‌ గంగా సరసన చేరాడు.

అలాగే భారత ఆటగాళ్లలో స్వదేశంలో ఆడకుండా విదేశాల్లోనే అత్యధిక టెస్టులు ఆడిన ఆటగాడిగానూ బుమ్రా కొత్త రికార్డు సృష్టించాడు. అంతకుముందు మాజీ పేసర్లు జవగళ్‌ శ్రీనాథ్‌ 12, ఆర్పీ సింగ్‌ 11 మ్యాచ్‌లు ఆడగా క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ విదేశాల్లో తొలుత 10 టెస్టులు ఆడాడు.  మొత్తంగా బుమ్రా 17 టెస్టుల్లో 79 వికెట్లు తీసి 2.70 ఎకానమీతో అద్భుతంగా రాణిస్తున్నాడు.

ఇవీ చదవండి..
ఇండియా-ఇంగ్లాండ్‌ టెస్ట్‌ క్రికెట్‌ విశేషాలు 
కోహ్లీ 31లోనైనా 71 చేరుకుంటాడా?


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని