
తాజా వార్తలు
టీ బ్రేక్: ఆసీస్ 243/7
ఇంటర్నెట్‌డెస్క్: బ్రిస్బేన్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న నిర్ణయాత్మక ఆఖరి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా నిలకడగా ఆడుతోంది. నాలుగో రోజు టీ విరామానికి ఆసీస్ ఏడు వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది. భారత్ కంటే 276 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ప్రస్తుతం కమిన్స్ (2), స్టార్క్ (1) క్రీజులో ఉన్నారు. అయితే, నిర్ణీత సమయం కంటే ముందే అంపైర్లు టీ విరామం ఇచ్చారు. మబ్బుల వల్ల మైదానంలో ఓ వైపు వెలుతురు తక్కువగా ఉంది. దీంతో ఆటను నిలిపివేసి, పిచ్‌ను కవర్లతో కప్పారు.
Tags :