ఆస్ట్రేలియన్ నోట ‘భారత్‌ మాతా కీ జై’
close

తాజా వార్తలు

Published : 21/01/2021 02:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆస్ట్రేలియన్ నోట ‘భారత్‌ మాతా కీ జై’

వైరల్ అవుతున్న వీడియో

ఇంటర్నెట్‌డెస్క్: ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా భిన్న అనుభూతుల్ని పొందింది. ఊహించని గాయాలు, 36 పరుగులకే ఆలౌటవ్వడం, గబ్బాలో చారిత్రక విజయం, కొందరు ఆస్ట్రేలియన్ల నుంచి జాత్యహంకార వ్యాఖ్యలు.. ఇలా టెస్టు సిరీస్‌లో ఎన్నో ఎదురయ్యాయి. అయితే గబ్బా వేదికగా జరిగిన నాలుగో టెస్టులో జ్ఞాపకంగా నిలిచిపోయే మరో సన్నివేశం చోటు చేసుకుంది.

టీమిండియా పోరాటానికి ముగ్ధుడైన ఓ ఆస్ట్రేలియన్‌...భారత్ మాతా కి జై, వందేమాతరం అంటూ నినాదాలు చేశాడు. అతడితో పాటు భారతీయులు కూడా జై కొట్టడంతో స్టేడియం దద్దరిల్లింది. ఈ రమణీయమైన దృశ్యం నెట్టింట్లో వైరల్‌గా మారింది. దేశసరిహద్దులకు అతీతంగా క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించిన అతడిని నెటిజన్లు అభినందిస్తున్నారు. భారత ఆటగాళ్లపై జాత్యహంకార వ్యాఖ్యలు చేసిన ఆకతాయిలు.. దీన్ని చూసి ఇప్పటికైనా మారాలని కామెంట్లు చేస్తున్నారు.

సిడ్నీ, గబ్బా టెస్టులో భారత ఆటగాళ్లు కొందరు ఆస్ట్రేలియన్ల ప్రేక్షకుల నుంచి జాతివివక్ష వ్యాఖ్యలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా సిరాజ్‌ను లక్ష్యంగా చేసుకుని వ్యాఖ్యలు చేశారు. ఈ అవాంఛనీయ సంఘటనపై క్రికెట్‌ ప్రపంచం భగ్గుమంది. ఐసీసీ, బీసీసీఐ తీవ్రంగా ఖండించగా క్రికెట్‌ ఆస్ట్రేలియా బాధ్యత వహించి క్షమాపణలు చెప్పింది. కాగా, ఆఖరి టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించి టెస్టు సిరీస్‌ను 2-1తో సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

ఇదీ చదవండి

ప్రపంచమంతా సెల్యూట్ చేస్తోంది: రవిశాస్త్రి

భారత్‌-ఎ జట్టుతో వాళ్లు గెలిచారు: పాంటింగ్‌

గబ్బా హీరోస్‌.. సూపర్‌ మీమ్స్‌Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని