close

తాజా వార్తలు

Published : 24/09/2020 19:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పంజాబ్‌తో పోరు.. టాస్‌ గెలిచిన కోహ్లీ

ఇంటర్నెట్‌ డెస్క్‌: దుబాయి వేదికగా పంజాబ్‌, బెంగళూరు జట్ల మధ్య మరికాసేపట్లో ఆరో టీ20 జరగనుంది. ఇప్పటికే కోహ్లీసేన ఆడిన తొలి మ్యాచ్‌లో హైదరాబాద్‌ను ఓడించింది. మరోవైపు రాహుల్‌ జట్టు దిల్లీ చేతిలో సూపర్‌ ఓవర్‌లో ఓటమి పాలైంది. ఇప్పుడు బెంగళూరునైనా ఓడించి ఈ సీజన్‌లో తొలి విజయం నమోదు చేయాలని పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలోనే మరికాసేపట్లో జరిగే మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన కోహ్లీ బౌలింగ్‌ ఎంచుకున్నాడు. బెంగళూరు ప్రస్తుతం రెండు పాయింట్లతో మూడో స్థానంలో ఉండగా, పంజాబ్‌ ఇంకా ఖాతా తెరవలేదు. ఈ మ్యాచ్‌ గెలిచి పాయింట్ల పట్టికలో తొలి స్థానం సంపాదించాలని బెంగళూరు, తొలి విజయం నమోదు చేయాలని పంజాబ్‌ పట్టుదలగా ఉన్నాయి.

పంజాబ్‌ జట్టు: కేఎల్‌ రాహుల్‌ (కెప్టెన్‌), మయాంక్‌ అగర్వాల్‌, కరన్‌ నాయర్‌, సర్ఫరాజ్‌ ఖాన్‌, గ్లెన్‌ మాక్స్‌వెల్‌, నికోలస్‌ పూరన్‌, జేమ్స్‌ నీషమ్‌, మురుగన్‌ అశ్విన్‌, మహ్మద్‌ షమి, షెల్డన్‌ కాట్రెల్‌, రవి బిష్ణోయ్‌

బెంగుళూరు జట్టు: ఆరోన్‌ ఫించ్‌, దేవ్‌దత్‌ పడిక్కల్‌, విరాట్‌ కోహ్లీ (కెప్టెన్‌), ఏబీ డివిలియర్స్‌, జోష్‌ ఫిలిప్‌, శివమ్‌ దూబె, వాషింగ్టన్‌ సుందర్‌, ఉమేశ్‌ యాదవ్‌, నవ్‌దీప్ సైని, డేల్‌స్టెయిన్‌, యుజువేంద్ర చాహల్‌


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.