రంజీకి బదులు విజయ్‌ హజారె ట్రోఫీ 

తాజా వార్తలు

Published : 30/01/2021 11:39 IST

రంజీకి బదులు విజయ్‌ హజారె ట్రోఫీ 

ఇంటర్నెట్‌డెస్క్‌: కరోనా వైరస్‌ పరిస్థితుల కారణంగా 2020-21 సీజన్‌లో రంజీ ట్రోఫీకి బదులు 50 ఓవర్ల విజయ్‌ హజారె ట్రోఫీ నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. ఈ మేరకు సెక్రటరీ జై షా శుక్రవారం అన్ని రాష్ట్ర క్రికెట్‌ సంఘాలకు లేఖ రాశారు. ఈ కరోనా మహమ్మారి అందరినీ పరీక్షించిందని, ఇలాంటి కఠిన పరిస్థితుల్లో రాష్ట్ర సంఘాల మద్దతుతోనే పురుషుల దేశవాళి, అంతర్జాతీయ క్రికెట్‌ను తిరిగి ప్రారంభించామని షా పేర్కొన్నారు. అయితే, 2020-21 సీజన్‌లో విలువైన సమయాన్ని కోల్పోయామన్నారు. దాంతో ఈ ఏడాది క్రికెట్‌ మ్యాచ్‌ల ప్రణాళికలు రూపొందించడానికి కష్టతరమైందని వివరించారు.

అలాగే మహిళల క్రికెట్‌ మ్యాచ్‌లు నిర్వహించడం కూడా ముఖ్యమని బీసీసీఐ సెక్రటరీ గుర్తుచేశారు. ‘ఈ విషయాన్ని తెలియజేసేందుకు సంతోషిస్తున్నా. సీనియర్‌ మహిళల వన్డే క్రికెట్‌తో పాటు విజయ్‌ హజారె, అండర్‌-19 క్రికెటర్లకు వినో మన్కడ్‌ ట్రోఫీలు నిర్వహించాలని అనుకుంటున్నాం. ఈ సీజన్‌లో దేశవాళీ క్రికెట్‌ నిర్వహణపై మీ నుంచి వచ్చిన వినతుల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని షా పేర్కొన్నారు. కాగా, మార్చి నెలాఖరున ఐపీఎల్‌ 14వ సీజన్‌ ప్రారంభమయ్యే అవకాశం ఉన్నందున ఫిబ్రవరిలోనే విజయ్‌ హజారె ట్రోఫీ నిర్వహించే అవకాశం ఉంది. అందుకు సంబంధించి త్వరలోనే వేదికలను ప్రకటిస్తారు. ఈ ట్రోఫీ కోసం ఆరు బయో బుడగలను ఏర్పాటు చేస్తుండగా ఆటగాళ్లంతా వచ్చే వారమే అందులోకి అడుగుపెడతారని తెలుస్తోంది. 

ఇవీ చదవండి..
‘గాయ’పడ్డ కెరీర్లు.. జాగ్రత్త క్రికెటర్లూ!
కోహ్లీని ఔట్ చేసే వ్యూహమదే: ఇంగ్లాండ్‌


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని