Team India: ఆటగాళ్లకు నోరూరించే ‘మాక్‌డక్‌’

తాజా వార్తలు

Published : 28/06/2021 01:14 IST

Team India: ఆటగాళ్లకు నోరూరించే ‘మాక్‌డక్‌’

(Photo: BCCI Twitter)

ఇంటర్నెట్‌డెస్క్‌: త్వరలో శ్రీలంక పర్యటనకు బయలుదేరే టీమ్ఇండియా ఆటగాళ్లు ప్రస్తుతం ముంబయిలోని ఓ స్టార్‌ హోటల్‌లో క్వారంటైన్‌లో ఉన్నారు. సోమవారంతో వారికి క్వారంటైన్‌ గడువు ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ఆటగాళ్లకు బీసీసీఐ సకల సౌకర్యాలు కల్పించింది. ఆదివారం వారికెంతో ఇష్టమైన ‘మాక్‌డక్‌’ అనే వెజిటేరియన్‌ రెసిపీని ప్రత్యేకంగా తయారు చేయించింది. అదెలా చేశారనే విషయాన్ని కూడా ఒక వీడియోలో బీసీసీఐ పంచుకుంది.

ఈ వీడియోలో ప్రధాన చెఫ్‌ రాకేశ్‌ కాంబ్లే తన సిబ్బందిని పరిచయం చేస్తూ వివరంగా ‘మాక్‌డక్‌’ను ఎలా వండుతారో చూపించారు. అది సంజూ శాంసన్‌కు ఎంతో ఇష్టమని, ధావన్‌ని కూడా రుచిచూడమంటే చాలా బాగుందని చెప్పాడని రాకేశ్‌ వెల్లడించారు. ఇక ముంబయికి చెందిన పాండ్య సోదరులు తరచూ దాన్ని తింటారని.. కనీసం మూడు, నాలుగు రోజులకు ఒకసారైనా చేసివ్వమంటారని చెప్పారు. కాగా, లంక పర్యటనకు వెళ్లే ఆటగాళ్ల గురించి బీసీసీఐ ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల్లో సమాచారం పంచుకుంటోంది. మరోవైపు ఈ పర్యటనకు తొలిసారి ఎంపికైన యువ క్రికెటర్లు.. దేవ్‌దత్‌ పడిక్కల్‌, చేతన్‌ సకారియా, నితీశ్‌ రాణా, కృష్ణప్పగౌతమ్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌ లాంటి ఆటగాళ్లు అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. లంకలో సత్తా చాటడానికి ఉవ్విళ్లూరుతున్నారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని