రోహిత్ మిస్‌ఫీల్డింగ్‌కు స్టోక్స్‌ కూడా షాక్‌!

తాజా వార్తలు

Updated : 07/02/2021 09:02 IST

రోహిత్ మిస్‌ఫీల్డింగ్‌కు స్టోక్స్‌ కూడా షాక్‌!

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత్‌×ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టులో స్టార్ బ్యాట్స్‌మన్‌ రోహిత్ శర్మ ఓ సులువైన క్యాచ్‌ను అందుకోలేకపోయాడు. దానికి టీమిండియా ఆటగాళ్లతో పాటు ప్రత్యర్థి జట్టు డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఉన్న బెన్‌ స్టోక్స్‌ సైతం ఆశ్చర్యపోయాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.

సుందర్‌ బౌలింగ్‌లో 175 ఓవర్‌లో డామ్ బెస్‌ (28*) షాట్‌కు ప్రయత్నించాడు. బంతి మిడ్‌ వికెట్‌లో ఉన్న రోహిత్‌ వైపునకు వెళ్లింది. అయితే ఎంతో సులువైన ఆ క్యాచ్‌ను హిట్‌మ్యన్‌ జారవిడిచాడు. దీంతో రోహిత్‌తో సహా టీమిండియా ఆటగాళ్లంతా ఎంతో నిరాశ చెందారు. మరోవైపు డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఉన్న స్టోక్స్‌ కూడా ఆశ్చర్యపోయాడు. రోహిత్ నుంచి ఊహించనది జరగడంతో అవాకయ్యాడు.

19 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద లైఫ్ దక్కించుకున్న బెస్‌ శనివారం ఆట ఆఖరి వరకు క్రీజులో నిలిచాడు. బౌండరీలు బాదుతూ జట్టు స్కోరును 550 దాటించాడు. అయితే చెపాక్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా పేలవ ఫీల్డింగ్ చేస్తోంది. నాలుగు క్యాచ్‌లను అందుకోలేకపోయింది. పంత్, అశ్విన్‌, పుజారా, రోహిత్ తలో క్యాచ్‌ను జారవిడిచారు.

ఇవీ చదవండి

‘రూట్’‌ను తప్పించడం ఎందుకింత కష్టం!

సీన్‌ రిపీట్‌: ఇంగ్లాండ్‌దే పైచేయి


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని