
తాజా వార్తలు
పిచ్ ఎలా ఉన్నా ఆడాల్సిందే
అహ్మదాబాద్: ఓ టెస్టు బ్యాట్స్‌మన్ ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆడేందుకు, పిచ్‌లు విసిరే సవాళ్లను తట్టుకునేందుకు సిద్ధంగా ఉండాలని ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ స్టోక్స్ అభిప్రాయపడ్డాడు. భారత్‌లో ఎక్కువగా స్పిన్‌కు సహకరించే పిచ్‌లు రూపొందిస్తున్నారనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో అతను ఈ విధంగా స్పందించాడు. ‘‘ఓ టెస్టు బ్యాట్స్‌మన్‌గా అన్ని రకాల పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. విదేశీ బ్యాట్స్‌మెన్ విజయవంతం కావడం ఎంతో కష్టంతో కూడుకున్న దేశాల్లో భారత్ ఒకటి. ఇంగ్లాండ్ కూడా అంతే. అది ఆటలో భాగం. ఇలాంటి సవాళ్లను మేం ప్రేమిస్తాం. రెండో టెస్టులో నేనెక్కువగా ఓవర్లు వేయకపోవడంపై అతిగా ఆలోచించవద్దు. ఆ పిచ్‌లో పచ్చిక ఉంటే మరిన్ని ఓవర్లు వేసేవాణ్ని. డేనైట్ మ్యాచ్ అయిన మూడో టెస్టులో నేను ఎక్కువగా బౌలింగ్ చేసే వీలుంది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ డేనైట్ మ్యాచ్‌లు జరిగిన లైట్ల వెలుతురులో పేసర్లకు గొప్ప అవకాశం ఉంటుంది. పునఃనిర్మించిన మొతేరా మైదానంలో అలాంటి సందర్భం మాకు అనుకూలంగా మారుతుందని అనుకుంటున్నా’’ అని స్టోక్స్ పేర్కొన్నాడు.