Maiden IPL wicket: 8 vs విరాట్‌ కోహ్లీ
close

తాజా వార్తలు

Published : 02/05/2021 01:43 IST

Maiden IPL wicket: 8 vs విరాట్‌ కోహ్లీ

వారందరి తొలి ఐపీఎల్‌ వికెట్‌ కోహ్లీయే

కెరీర్లో తొలి వికెట్‌ తీయడం ప్రతి ఒక్కరికీ మధుర జ్ఞాపకం. ఇక ఆ వికెట్‌ ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌ది అయితే ఆ ఆనందం రెట్టింపు అవుతుంది. టీమ్‌ఇండియా, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు సారథి విరాట్‌ కోహ్లీని పెవిలియన్‌ పంపించడం అలాంటి అనుభూతే. ఇప్పటి వరకు ఎనిమిది మంది బౌలర్లు ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో పరుగుల రారాజును అలా ఔట్‌ చేశారు తెలుసా!


అశోక్‌ దిండా: దేశవాళీలో సుదీర్ఘ అనుభవం ఉన్న దిండా అరంగేట్రం ఐపీఎల్‌లో కోల్‌కతా నైైట్‌రైడర్స్‌కు ఆడాడు. 2008లో బెంగళూరుతో పోరులో విరాట్‌ కోహ్లీ (1; 5 బంతుల్లో)ని క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. బ్రెండన్‌ మెక్‌కలమ్‌ ఊచకోత కోసిన ఈ మ్యాచులో ఆర్‌సీబీ 82 పరుగులకే కుప్పకూలింది.


ఆశీష్‌ నెహ్రా: 2008 సీజన్లో ముంబయి ఇండియన్స్‌కు ఆడాడు ఆశీష్‌ నెహ్రా. ఈ పొడగరి పేసర్‌ ఐపీఎల్‌లో తన తొలి వికెట్‌గా కోహ్లీ (23; 14 బంతుల్లో 3×4, 1×6)ని ఔట్‌ చేశాడు. ఛేదనలో జట్టు స్కోరు 106 వద్ద అతడిని పెవిలియన్‌కు పంపించాడు.


ఆల్బీ మోర్కెల్‌: దక్షిణాఫ్రికా ఆటగాడైన ఆల్బీ అరంగేట్రం సీజన్లో చెన్నై సూపర్‌కింగ్స్‌కు ఆడాడు. విరాట్‌ కోహ్లీ (12; 7 బంతుల్లో 2×4)ని క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. 179 పరుగుల లక్ష్యంతో దిగిన ఆర్‌సీబీ 165కు పరిమితమైంది. విరాట్‌ 149 వద్ద వెనుదిరిగాడు.


చేతన్య నందా: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగులో 2009లో అరంగేట్రం చేశాడు నందా. ఆడింది కేవలం 2 మ్యాచులే. తీసింది 2 వికెట్లే. అందులో విరాట్‌ కోహ్లీ ఉండటం గమనార్హం. ముంబయి ఇండియన్స్‌ తరఫున ఆడిన నందా.. ఓపెనింగ్‌ చేసిన విరాట్‌ (20; 22 బంతుల్లో 4×4)ను పెవిలియన్‌ పంపించాడు. డుమిని క్యాచ్‌ అందుకున్నాడు.


డగ్లస్‌ బ్రాస్‌వెల్‌: న్యూజిలాండ్‌కు చెందిన ఈ ఆటగాడు ఐపీఎల్‌లో ఆడింది ఒకే మ్యాచ్‌. అయితే 3 వికెట్లు తీశాడు. అందులో తొలి వికెట్‌ విరాట్‌దే. 2012లో దిల్లీకి ఆడిన డగ్లస్‌.. జట్టు స్కోరు 56 వద్ద కోహ్లీ (8; 8 బంతుల్లో 1×4)ని పెవిలియన్‌ పంపించాడు.


మిచెల్‌ మెక్లెనగన్‌: కివీస్ పేసర్‌ మిచెల్‌ మెక్లెనగన్‌ ముంబయికి ఎలాంటి విజయాలు అందించాడో తెలిసిందే. 2015లో అతడు ఆర్‌సీబీపై అరంగేట్రం చేశాడు. మూడో స్థానంలో వచ్చిన విరాట్‌ కోహ్లీ (18; 18 బంతుల్లో 1×4, 1×6)ని ఔట్‌ చేశాడు. విరాట్‌ క్యాచ్‌ను అంబటి రాయుడు అందుకున్నాడు.


జస్ప్రీత్‌ బుమ్రా: పేసుగుర్రం జస్ప్రీత్‌ బుమ్రా తొలి వికెట్‌ సైతం విరాట్‌ కోహ్లీనే. 2013లో బుమ్రా ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు. దూకుడుగా ఆడుతున్న కోహ్లీ (24; 14 బంతుల్లో 4×4, 1×6)ని వికెట్ల ముందు దొరకబుచ్చుకొన్నాడు. తానొక విలువైన ఆటగాడినని అప్పుడే చాటాడు.


హర్‌ప్రీత్‌ బ్రార్‌: తాజా సీజన్లో (2021) పంజాబ్‌ కింగ్స్‌ తరఫున అరంగేట్రం చేశాడు హర్‌ప్రీత్‌. పేరుకు తగ్గట్టే అందరి మనసులు దోచేశాడు. ఆర్‌సీబీపై బ్యాటుతో కీలక పరుగులు చేసిన అతడే బంతితో 3 వికెట్లు తీశాడు. తొలుత దూకుడుగా ఆడిన విరాట్‌ కోహ్లీ (35; 34 బంతుల్లో 3×4, 1×6)ని క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. ఆ తర్వాత మాక్సీ, ఏబీని పెవిలియన్‌ పంపించాడు.

-ఇంటర్నెట్‌ డెస్క్‌


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని