
తాజా వార్తలు
విమాన ప్రమాదంలో ఆటగాళ్ల దుర్మరణం
ఇంటర్నెట్‌డెస్క్: కరోనా వైరస్ సోకిన నలుగురు ఫుట్‌బాల్ ఆటగాళ్లు విమాన ప్రమాదంలో మృతిచెందారు. ఈ ఘటన బ్రెజిల్‌లోని టోకాంటిన్స్ ప్రాంతంలో చోటుచేసుకుంది. పాల్మాస్ క్లబ్‌కు చెందిన నలుగురు ఆటగాళ్లకు ఇటీవల కరోనా వైరస్ సోకింది. ఆదివారంతో వారి ఐసోలేషన్ గడువు పూర్తికానుంది. ఈ నేపథ్యంలోనే విలానోవా జట్టుతో తలపడేందుకు తోటిఆటగాళ్లతో కాకుండా ఆదివారం ప్రత్యేక విమానంలో బయలుదేరారు. టొకాంన్‌టిన్స్ విమానాశ్రయం నుంచి గొయానాకు టేకాఫ్ అవుతుండగా రన్‌వే అంచున విమానం ప్రమాదానికి గురైంది. దీంతో అందులోని ఆరుగురు మృతి చెందినట్లు అక్కడి అధికారులు పేర్కొన్నారు. మృతిచెందిన వారిలో పాల్మాస్ క్లబ్ ప్రెసిడెంట్ లాకస్ మీరాతో పాటు ఆటగాళ్లు లుకాస్ ప్రాక్సీడ్స్, గుల్‌హెరిమ్, రానులే, మార్కస్ మొలినారి ఉన్నారు.
ఇవీ చదవండి..
ఒకే ఆటగాడు. ఒకే బంతి.. రెండుసార్లు రనౌట్
ఆ బాధేంటో నాకు తెలుసు: రహానె