పాలిచ్చే అమ్మగానా? పోటీపడే అథ్లెట్‌గానా?  

తాజా వార్తలు

Published : 26/06/2021 09:32 IST

పాలిచ్చే అమ్మగానా? పోటీపడే అథ్లెట్‌గానా?  

సందిగ్ధంలో కెనడా బాస్కెట్‌బాల్‌ క్రీడాకారిణి

టొరంటో: కెనడా బాస్కెట్‌బాల్‌ క్రీడాకారిణి కిమ్‌ గౌచర్‌ గొప్ప సందిగ్ధంలో పడింది. ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్‌లో పోటీపడాలని ప్రతి అథ్లెట్‌ కల కంటారు. మరోవైపు తన బిడ్డకు కడుపు నిండా పాలిచ్చి జోల పాడాలని ప్రతి తల్లి కోరుకుంటుంది. ఇప్పుడు కిమ్‌.. ఆ కలకు, అమ్మ ప్రేమకు మధ్య ఊగిసలాడుతోంది. ఈ రెండింటి మధ్య ఏదో ఒకటి తేల్చుకోవాల్సిన పరిస్థితులను ఎదుర్కొంటుంది. టోక్యోలో పోటీపడే కెనడా మహిళల బాస్కెట్‌బాల్‌ జట్టులో సభ్యురాలైన 37 ఏళ్ల కిమ్‌.. మార్చిలో తన కూతురు సోఫీకి జన్మనిచ్చింది. ప్రస్తుత కరోనా పరిస్థితుల కారణంగా ఒలింపిక్స్‌ నిర్వహకులు పెట్టిన నిబంధనల ప్రకారం ఆమె.. తన మూడు నెలల పాపను టోక్యో తీసుకెళ్లడానికి వీల్లేదు. పాపను వెంట తెచ్చుకునేందుకు అనుమతించాలని అన్ని రకాలుగా ప్రయత్నించానని, కానీ ఎవరూ ఏమీ చేయలేకపోతున్నారని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన వీడియోలో ఆమె తన ఆవేదనను బయటపెట్టింది. అథ్లెట్ల స్నేహితులను, కుటుంబ సభ్యులను అనుమతించమని, ఎవరికీ మినహాయింపు లేదని నిర్వాహకులు చెప్పినట్లు ఆమె పేర్కొంది. తన పాలను టోక్యో నుంచి కెనడాలోని పాపకు పంపించేలా ప్రత్యామ్నాయం కోసం ఆమె చూస్తోంది. కానీ అలా చేయడం ద్వారా సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. ప్రస్తుత ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నాలుగో స్థానంలో ఉన్న కెనడా అమ్మాయిల బాస్కెట్‌బాల్‌ జట్టు వచ్చే నెల 26న తన తొలి మ్యాచ్‌లో సెర్బియాతో తలపడనుంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని