IPL 2021: కరీబియన్ల రాకకు మార్గం సుగమం!
close

తాజా వార్తలు

Published : 19/06/2021 01:13 IST

IPL 2021: కరీబియన్ల రాకకు మార్గం సుగమం!

సీపీఎల్‌ను ముందుకు జరిపేందుకు విండీస్‌ అంగీకారం!

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ అభిమానులకు శుభవార్త! రెండో దశలో విదేశీ ఆటగాళ్లను తీసుకొచ్చేందుకు బీసీసీఐ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి! వెస్టిండీస్‌ క్రికెటర్ల రాకకు మార్గం సుగమం కానుంది. బీసీసీఐ విజ్ఞప్తి మేరకు కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (సీపీఎల్‌) తేదీలను ముందుకు జరిపేందుకు విండీస్‌ బోర్డు అంగీకరించింది. వారం నుంచి పది రోజులు ముందుకు జరపాలని నిర్ణయించిందని తెలిసింది.

కరోనా వైరస్‌ వల్ల ఐపీఎల్‌ 2021 సీజన్‌ సగంలోనే ఆగిపోయిన సంగతి తెలిసిందే. నిరవధికంగా వాయిదా పడిన సీజన్‌ను సెప్టెంబర్‌ 19 నుంచి అక్టోబర్‌ 15 వరకు యూఏఈలో నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. ఆ సమయంలో ద్వైపాక్షిక సిరీసులు ఉండటంతో ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ క్రికెటర్లు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. దేశానికే తొలి ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుందని ఆయా బోర్డులు ఇప్పటికే ఆటగాళ్లకు స్పష్టం చేశాయి. జాతీయ జట్టుకు ఎంపికవ్వని వాళ్లు మాత్రం వెళ్లేందుకు ఇబ్బంది లేదని చెబుతున్నాయి.

వెస్టిండీస్‌కు ద్వైపాక్షిక సిరీసులు లేనప్పటికీ ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్‌ 19 వరకు సీపీఎల్‌ నిర్వహిస్తామని విండీస్‌ బోర్డు ప్రకటించింది. దాంతో కరీబియన్‌ స్టార్లు ఐపీఎల్‌కు వచ్చేందుకు కుదరడం లేదు. దాంతో సీపీఎల్‌ను కొన్నిరోజులు ముందుకు జరపాలని బీసీసీఐ కోరింది. మొదట్లో కుదరకపోవచ్చన్న విండీస్‌ తాజాగా తేదీలను ముందుకు జరిపేందుకే నిర్ణయించినట్టు తెలిసింది. దాంతో క్రిస్‌గేల్‌, డ్వేన్‌ బ్రావో, కీరన్‌ పొలార్డ్‌, జేసన్‌ హోల్డర్‌, ఆండ్రీ రసెల్‌ తదితరులు ఐపీఎల్‌ ఆడేందుకు మార్గం సుగమం కానుంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని