close

తాజా వార్తలు

Published : 28/02/2021 01:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ప్రేక్షకుల్లేకుండానే భారత్‌×ఇంగ్లాండ్ వన్డేలు

ఇంటర్నెట్‌డెస్క్: పుణె వేదికగా జరగనున్న భారత్‌×ఇంగ్లాండ్ మూడు వన్డేలను స్టేడియంలో ప్రేక్షకులు లేకుండా నిర్వహించనున్నారు. మహారాష్ట్రలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మహారాష్ట్ర క్రికెట్ అసోషియేషన్‌ (ఎంసీఏ) ప్రకటించింది. కరోనా ఉద్ధృతి నేపథ్యంలో ముఖ్యమంత్రి ఉద్దవ్‌ ఠాక్రే సూచనల మేరకు వన్డే సిరీస్‌ను ప్రేక్షకుల లేకుండా నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది. ఆటగాళ్లు, అధికారులకు కరోనా సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకుని విజయవంతంగా మ్యాచ్‌లను నిర్వహించాలని ముఖ్యమంత్రి ఎంసీఏని కోరారని తెలిపింది.

కరోనా వ్యాప్తి అనంతరం దేశంలో ఇంగ్లాండ్‌ సిరీస్‌తోనే అంతర్జాతీయ క్రికెట్ తిరిగి ప్రారంభమైన సంగతి తెలిసిందే. చెన్నై వేదికగా జరిగిన రెండో టెస్టు నుంచి స్టేడియాల్లోకి 50శాతం మందికి అనుమతిస్తున్నారు. నాలుగు టెస్టుల సిరీస్‌ ముగిసిన అనంతరం షెడ్యూల్‌ ప్రకారం మార్చి 12 నుంచి అహ్మదాబాద్‌లో అయిదు టీ20ల సిరీస్‌ జరగనుంది. ఆ తర్వాత మార్చి 23 నుంచి పుణె వేదికగా మూడు వన్డేల సిరీస్‌ జరగనుంది. ప్రస్తుతం టీమిండియా, ఇంగ్లాండ్‌ జట్లు గురువారం నుంచి మొదలుకానున్న ఆఖరి టెస్టు కోసం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలోనే సాధన చేస్తున్నాయి.


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని