close

తాజా వార్తలు

Published : 21/01/2021 15:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

తరాల పాటు ఈ సిరీస్‌ను గుర్తుంచుకుంటారు..! 

బీసీసీఐకి రుణపడి ఉంటాం: క్రికెట్‌ ఆస్ట్రేలియా

ఇంటర్నెట్‌డెస్క్‌: ఈసారి టీమిండియా సుదీర్ఘ పర్యటన దిగ్విజయంగా సాగడానికి కృషిచేసిన బీసీసీఐకి ఎప్పటికీ రుణపడి ఉంటామని క్రికెట్‌ ఆస్ట్రేలియా పేర్కొంది. తాజాగా బీసీసీఐ అధికారులకు రాసిన ఓ లేఖలో ఈ వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మందిని అలరించిన ఈ సిరీస్‌ గురించి భవిష్యత్తు తరాలు చర్చించుకుంటాయని చెప్పింది. 

‘ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు నెలకొన్న కరోనా పరిస్థితుల్లో అంతర్జాతీయ టోర్నీలు నిర్వహించడం సవాళ్లతో కూడుకున్నది. ఈ నేపథ్యంలో మాకు సహకరించిన టీమ్‌ఇండియా ఆటగాళ్లు, సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు. గడిచిన రెండు నెలల్లో టీమ్‌ఇండియా, ఆస్ట్రేలియా ఆటగాళ్లు అత్యద్భుతమైన వన్డే, టీ20 సిరీస్‌లు ఆడారు. అలాగే చిరస్థాయిగా నిలిచిపోయే టెస్టు సిరీస్‌ కూడా అందించారు. మరోవైపు ఎలాంటి సవాళ్లు ఎదురైనా అంతర్జాతీయ క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించి బీసీసీఐ మాకు సహకరించింది’ అని సీఏ లేఖలో రాసుకొచ్చింది. 

‘అలాగే బౌలింగ్‌ విభాగంలో బుమ్రా నుంచి కమిన్స్‌ వరకు, బ్యాటింగ్‌లో రహానె నుంచి స్మిత్‌ వరకు.. అరంగేట్రం ఆటగాళ్లలో శుభ్‌మన్‌ నుంచి గ్రీన్‌ వరకు ఇంకా చాలా మంది గత తొమ్మిది వారాల్లో మంచి క్రికెట్‌ జ్ఞాపకాలను అందించారు. ఈ పర్యటన ఇంత గొప్పగా సాగడానికి, మా కోసం త్యాగాలు చేసిన బీసీసీఐ అధికారులను ఎప్పటికీ మర్చిపోలేము. ఈ సందర్భంగా ప్రభుత్వ, ఆరోగ్యశాఖ అధికారులకు, మైదానాల సిబ్బందికి, బ్రాడ్‌కాస్టర్లకు, ఆటగాళ్లకు, మ్యాచ్‌ల నిర్వాహకులకు, ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు. ఇక చివరగా క్రికెట్‌ ఆస్ట్రేలియా తరఫున టీమ్‌ఇండియాకు అభినందనలు. ఎంతో పట్టుదల, నైపుణ్యం ప్రదర్శించి బోర్డర్‌-గావస్కర్‌ సిరీస్‌ను నిలుపుకుంది. ఈ సిరీస్‌ గురించి భవిష్యత్తు తరాలు కూడా చర్చించుకుంటారు’ అని సీఏ వివరించింది. 

ఇవీ చదవండి..
ఇంకా నయం.. వారినీ తీసేస్తారనుకున్నా: గంభీర్‌  
శంషాబాద్‌లో సిరాజ్‌కు ఘన స్వాగతం..



Tags :

స్పోర్ట్స్

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని