ఇటలీ విజేతలకు సచిన్‌ సహా క్రికెటర్ల అభినందనలు

తాజా వార్తలు

Updated : 12/07/2021 16:19 IST

ఇటలీ విజేతలకు సచిన్‌ సహా క్రికెటర్ల అభినందనలు

ఇంటర్నెట్‌డెస్క్‌: ఉత్కంఠగా సాగిన యూరోకప్‌ 2020 ఫైనల్లో బలమైన ఇంగ్లాండ్‌పై ఇటలీ విజయం సాధించడంతో పలువురు క్రికెటర్లు ఆ జట్టుకు అభినందనలు తెలిపారు. సామాజిక మాధ్యమాల ద్వారా స్పందిస్తూ ఓడినా ఇంగ్లాండ్‌ బాగా ఆడిందని మెచ్చుకున్నారు. అలాగే గెలిచినందుకు ఇటలీకి కంగ్రాట్స్‌ చెబుతున్నారు. క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌, ఇంగ్లాండ్‌ మాజీ ఆటగాడు కెవిన్‌ పీటర్సన్‌, పాకిస్థాన్‌ మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌తో పాటు పలువురు ఈతరం క్రికెటర్లు సైతం యూరోకప్‌ ఫైనల్‌పై ట్వీట్లు చేశారు.

తొలుత మ్యాచ్‌ ప్రారంభమైన ఆదిలోనే ఇంగ్లాండ్‌ ఆటగాడు లుక్‌ షా గోల్‌ సాధించడంతో ఆ జట్టు తొలిభాగంలో పైచేయి సాధించింది. ఇక రెండో భాగంలో ఇటలీ డిఫెండర్‌ లియోనార్డో బానుస్సి 67వ నిమిషంలో గోల్‌ చేసి స్కోర్లు సమం చేశాడు. తర్వాత ఇరు జట్లూ మరో గోల్‌ చేయకపోవడంతో మ్యాచ్‌ అదనపు సమయానికి చేరింది. ఆపై పెనాల్టీస్‌ షూటౌట్‌కు వెళ్లింది. ఈ క్రమంలో అక్కడ దూకుడు ప్రదర్శించిన ఇటలీ 3-2 తేడాతో ఇంగ్లిష్‌ జట్టును ఓడించింది. దాంతో ఇంగ్లాండ్‌ నిరాశతో వెనుదిరిగింది.
Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని