England: ఛారిటీ క్రికెట్‌ మ్యాచ్‌లో చెలరేగిన వివాదం
close

తాజా వార్తలు

Updated : 22/07/2021 03:23 IST

England: ఛారిటీ క్రికెట్‌ మ్యాచ్‌లో చెలరేగిన వివాదం

బ్యాట్లతో తలలు బాదుకున్న ఆటగాళ్లు

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇంగ్లాండ్‌లో జరిగిన ఓ ఛారిటీ క్రికెట్ మ్యాచ్‌లో ఆటగాళ్ల మధ్య చెలరేగిన వివాదం బ్యాట్లతో తీవ్రంగా కొట్టుకునే వరకు వెళ్లింది. ఈ క్రమంలో ఇద్దరి తలలకు బలంగా దెబ్బలు తగిలాయి. పాకిస్థాన్‌లో వైద్యం అవసరమైన పేదల కోసం విరాళాలు సేకరించేందుకు మైడ్ స్టోన్ లోని మోటే పార్క్ క్రికెట్ క్లబ్‌లో ఓ ఛారిటీ మ్యాచ్ నిర్వహించారు. మధ్యలో వివాదంతో ఆటగాళ్లు బ్యాటులతో ఒకరికొకరు దాడిచేసుకున్నారు. చుట్టుపక్కల వాళ్ళు వాళ్లను అపడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో మ్యాచ్‌ మధ్యలోనే ఆగిపోయింది. మరో రెండు ఓవర్లలో మ్యాచ్‌ ముగిసిపోతుందనగా కొంతమంది మైదానంలోకి వచ్చి ఆటగాళ్లపై దాడి చేశారని నిర్వాహకులు తెలిపారు. గొడవకు గల కారణం తెలియరాలేదని పేర్కొన్నారు. 



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని