Aditi Hundai: ఈ అందాల బొమ్మ.. ‘ఇషాన్‌’ భామ!

తాజా వార్తలు

Published : 07/07/2021 01:23 IST

Aditi Hundai: ఈ అందాల బొమ్మ.. ‘ఇషాన్‌’ భామ!

ఇంటర్నెట్‌ డెస్క్‌: క్రీడారంగంతో సినిమా, మోడలింగ్‌కు ఎంతో అవినాభావ సంబంధం ఉంది. నటీమణులను, మోడళ్లను క్రికెటర్లు ప్రేమించడం, తమ జీవిత భాగస్వాములుగా చేసుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. ఈ కోవలోకి టీమిండియా ఆటగాడు ఇషాన్ కిషన్‌ చేరినట్లు ఉన్నాడు. ప్రముఖ మోడల్‌ అదితి హుందాయితో ఇషాన్‌ డేటింగ్‌ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సోషల్‌ మీడియాలో రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇంతవరకు వీరిద్దరి నుంచి అధికారికంగా ప్రకటన వెలువడలేదు. 

అసలెవరీ అదితి? 

* ఫ్యాషన్ రంగలో అదితి హుందాయి తెలియని వారుండరు.
* అదితి హుందాయి 1997 జనవరి 15న రాజస్థాన్‌లో జన్మించింది.  

 రెండేళ్ల నుంచి ప్రేమలో..!

* ఇషాన్‌ కిషన్‌, అదితి గత రెండేళ్లుగా డేటింగ్‌లో ఉన్నారని సోషల్‌ మీడియా కోడైకూస్తోంది.
* పబ్లిక్‌గా ఇద్దరూ తమ రిలేషన్‌షిప్‌ గురించి ప్రకటించకపోయినా.. వారి సామాజిక మాధ్యమాల పోస్టులనుబట్టి నెటిజన్లు నిర్థరణకు వచ్చేశారు.  

 ఫేవరెట్‌ క్రికెటర్  అతడు కాదట?

* అయితే అదితికి ఫేవరెట్‌ క్రికెటర్ ఇషాన్‌ కాదట..
* అవును టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనీ, ప్రస్తుత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఇష్టమైన ఆటగాళ్లట
* అదితికి ఇన్‌స్టాగ్రామ్‌లో 2.58 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. 

* 2017లో ఎఫ్‌బీబీ కలర్స్‌ ఫెమినా మిస్‌ ఇండియా రాజస్థాన్‌ పోటీలో విజేతగా నిలిచింది.
* పోలెండ్‌ వేదికగా జరిగిన మిస్‌ సూపర్‌నేషనల్‌ కాంటెస్ట్‌లో భారత్‌ తరఫున పాల్గొంది.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని