పడిపోకుండా పట్టుకొనేదీ.. నడిపించేదీ నాన్నే
close

తాజా వార్తలు

Published : 20/06/2021 15:19 IST

పడిపోకుండా పట్టుకొనేదీ.. నడిపించేదీ నాన్నే

తండ్రుల దినోత్సవం రోజు క్రికెటర్ల భావోద్వేగం

ఇంటర్నెట్‌ డెస్క్‌: వెనక్కి పడిపోకుండా పట్టుకొనేది నాన్న.. భయంతో వెనుకంజ వేస్తే భుజం తట్టి ముందుకు నడిపించేదీ నాన్న... అంటూ అంతర్జాతీయ తండ్రుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు టీమ్‌ఇండియా క్రికెటర్లు. తమ తండ్రులతో అనుంబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. దిగ్గజ క్రికెటర్‌ సచిన్‌ తెందూల్కర్‌.. ఈ మధ్యే తండ్రిని కోల్పోయిన హార్దిక్‌ పాండ్య.. హైదరాబాదీ సొగసరి క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ తదితరులు ట్వీట్లు చేశారు.

‘ఒక పాటో.. ఒక సువాసనో.. కొన్ని మనల్ని గతంలోకి తీసుకెళ్లే టైమ్‌ మెషిన్ల లాగా పనిచేస్తాయి. నాకైతే మా నాన్నగారితో గడిపిన బాల్యం అలాంటిదే. అది నన్నెప్పుడూ పాత జ్ఞాపకాల్లోకి తీసుకెళ్తుంది. తండ్రుల దినోత్సవం సందర్భంగా అలాంటి ప్రత్యేక ప్రదేశాన్ని నేను మీకు చూపిస్తాను. బాబా, మిమ్మల్ని మిస్సవుతున్నా’ అని సచిన్‌ ఓ వీడియోను ట్వీట్‌ చేశారు. ఇంట్లో తన తండ్రి కూర్చొనే ఊయల గురించి వివరించారు. దానిని చూసినా.. దాంట్లో కూర్చున్నా.. నాన్న గుర్తొస్తారని భావోద్వేగానికి గురయ్యారు.

‘మనం వెనక్కి పడిపోకుండా పట్టుకొనేదీ.. మనం ముందుకెళ్లేలా నడిపించేదీ నాన్నే. ఆయన ఒక దీపకాంతిలా ప్రేమతో మనకు తోవ చూపిస్తారు’ అని వీవీఎస్‌ లక్ష్మణ్‌ ట్వీట్‌ చేశారు. 

‘పప్పా, పితృత్వం ఎలా ఉంటుందో నేను మీనుంచే నేర్చుకున్నా. మేమీరోజు ఈ స్థాయిలో ఉండేందుకు మీరు చూపిన మార్గం, చేసిన సాయం, పంచిన ప్రేమే కారణం. మీరు నాకు బోధించిన ప్రతిదీ నేను అగస్త్యతో పంచుకుంటాను’ అని హార్దిక్‌ పాండ్య అన్నాడు. అతడితో పాటు శిఖర్ ధావన్‌, వీరేంద్ర సెహ్వాగ్‌, సురేశ్‌ రైనా తదితరులు తమ తండ్రులతో  అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అందరికీ తండ్రుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని