MI VS CSK: ముంబయి ఇండియన్స్ లక్ష్యం 157

తాజా వార్తలు

Updated : 19/09/2021 21:32 IST

MI VS CSK: ముంబయి ఇండియన్స్ లక్ష్యం 157

ఇంటర్నెట్‌ డెస్క్‌: దుబాయ్‌ వేదికగా ముంబయి ఇండియన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన సీఎస్కే నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్ (88; 58 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధసెంచరీతో  రాణించగా.. రవీంద్ర జడేజా (26) ఫర్వాలేదనిపించాడు. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ధోనీసేన.. తొలి మూడు ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయింది. డుప్లెసిస్, మొయిన్ అలీ డకౌటయ్యారు. తర్వాత క్రీజులోకి వచ్చిన అంబటి రాయుడు రిటైర్డ్ హార్ట్‌గా వెనుదిరిగాడు. కెప్టెన్‌ ధోనీ (3) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు.

వరుస ఓవర్లలో వికెట్లు కోల్పోయిన చెన్నైని రుతురాజ్ గైక్వాడ్‌ ఆదుకున్నాడు. వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును ముందుకు కదిలించాడు. జడేజా ఔటైన తర్వాత  క్రీజులోకి వచ్చిన బ్రావో (23; 8 బంతుల్లో 3 సిక్స్‌లు) కాసేపు మెరుపులు మెరిపించాడు. బౌల్ట్‌ వేసిన 19వ ఓవర్‌లో 24 పరుగులు వచ్చాయి. బుమ్రా వేసిన చివరి ఓవర్‌లో రెండో బంతికి బ్రావో.. కృనాల్‌ పాండ్యకు చిక్కాడు. తర్వాత రుతురాజ్‌ ఓ ఫోర్‌, సిక్స్‌ బాదాడు. ముంబయి ఇండియన్స్‌ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్‌, మిల్నే, బుమ్రా తలో రెండు వికెట్లు పడగొట్టారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని