
తాజా వార్తలు
భారత్తో ఆడి తప్పు చేశానేమో : వార్నర్
సిడ్నీ: భారత్తో చివరి రెండు టెస్టులు ఆడి బహుశా తప్పు చేశానేమోనని, అందువల్లే గాయం నుంచి పూర్తిగా కోలుకునేందుకు ఎక్కువ సమయం పడుతోందని ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ అన్నాడు. ఆస్ట్రేలియాలో భారత పర్యటన సందర్భంగా వన్డే సిరీస్ మధ్యలో గాయపడ్డ అతను.. దాని నుంచి పూర్తిగా కోలుకోకముందే టీమ్ఇండియాతో చివరి రెండు టెస్టుల్లో ఆడాడు. ఆ మ్యాచ్ల్లో అతను వరుసగా 5, 13, 1, 48 పరుగులు చేశాడు.
‘‘మా జట్టుకు సాయం చేయాలనే ఉద్దేశంతో ఆ చివరి రెండు టెస్టులాడాలనుకున్నా. ఇప్పుడు ఆలోచిస్తే తప్పు చేశానేమో అనిపిస్తోంది. గాయంతో ఆడడంతో దాని తీవ్రత మరింత పెరిగి కోలుకునేందుకు ఎక్కువ సమయం పడుతోంది. నా గురించి ఆలోచించి ఉంటే కచ్చితంగా ఆడేవాణ్ని కాదు. జట్టుకు మేలు జరుగుతుందని అలా చేశా. ఉదరం, గజ్జల్లో ఇలాంటి నొప్పి ఇంతకుముందెప్పుడూ అనుభవించలేదు’’ అని వార్నర్ పేర్కొన్నాడు.
ఇవీ చదవండి
Tags :