ఆర్సీబీ జట్టులో కరోనా కలవరం.. 
close

తాజా వార్తలు

Published : 04/04/2021 10:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆర్సీబీ జట్టులో కరోనా కలవరం.. 

దేవ్‌దత్‌ పడిక్కల్‌కు పాజిటివ్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశంలో రోజురోజుకు విజృంభిస్తున్న కరోనా ఈసారి ఐపీఎల్‌పై గట్టిగానే ప్రభావం చూపేటట్లు అనిపిస్తోంది. ఇప్పటికే దిల్లీ క్యాపిటల్స్‌ ఆటగాడు అక్షర్‌ పటేల్‌తో సహా లీగ్‌తో సంబంధమున్న మరో 20 మంది వైరస్‌ బారిన పడ్డారు. అయితే, తాజాగా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఓపెనర్‌ దేవ్‌దత్‌ పడిక్కల్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆర్సీబీ శిబిరంలో కలవరపాటు మొదలైంది. ప్రస్తుతం అతడిని ప్రత్యేకంగా ఐసోలేషన్‌లో ఉంచినట్లు తెలుస్తోంది.

గతేడాదే ఐపీఎల్‌లో బెంగళూరు తరఫున ఆడిన దేవ్‌దత్‌ అరంగేట్రం సీజన్‌లోనే అదరగొట్టాడు. 15 మ్యాచ్‌ల్లో 31.53 సగటుతో 473 పరుగులు సాధించాడు. ఈ నేపథ్యంలోనే ఇటీవల దేశవాళి క్రికెట్‌లో సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో ఆరు మ్యాచ్‌ల్లో 43.60 సగటుతో 218 పరుగులు చేసిన అతడు విజయ్‌ హజారే ట్రోఫీలో మరింత రెచ్చిపోయాడు. మొత్తం 737 పరుగులు చేసి టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. కాగా, ఇప్పుడు కరోనా బారినపడడంతో శుక్రవారం ముంబయి ఇండియన్స్‌తో ఆర్సీబీ తలపడే తొలి మ్యాచ్‌లో పడిక్కల్‌ ఆడడం కుదరకపోవచ్చు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని