Dinesh Karthik: నా తల్లి, భార్య కూడా కోప్పడ్డారు 

తాజా వార్తలు

Published : 05/07/2021 01:00 IST

Dinesh Karthik: నా తల్లి, భార్య కూడా కోప్పడ్డారు 

క్షమాపణలు చెప్పిన వెటరన్‌ క్రికెటర్‌ దినేశ్‌ కార్తీక్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో వ్యాఖ్యాతగా మారిన టీమ్‌ఇండియా సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ దినేశ్‌ కార్తీక్‌ తాజాగా వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఛాంపియన్‌షిప్‌లో తన వాక్చాతుర్యంతో ఆకట్టుకున్న అతడు.. గురువారం ఇంగ్లాండ్, శ్రీలంక జట్ల మధ్య జరిగిన రెండో వన్డేలో మహిళల గురించి అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దానిపై సామాజిక మాధ్యమాల్లో తీవ్ర దుమారం రేగడంతో పాటు సొంత కుటుంబ సభ్యుల నుంచి కూడా డీకే వ్యతిరేకత ఎదుర్కొన్నాడు. దాంతో ఆదివారం బహిరంగ క్షమాపణలు చెప్పాడు.

‘‘గత మ్యాచ్‌లో జరిగిన దానికి నేను క్షమాపణలు చెప్పాలనుకుంటున్నా. అదసలు నా ఉద్దేశమే కాదు. దాన్ని తప్పుగా వ్యక్తీకరించాను. ఆ విషయంలో ప్రతిఒక్కరికీ క్షమాపణలు చెబుతున్నా. కచ్చితంగా అలా వ్యాఖ్యానించాల్సింది కాదు. అలా అనడం వల్ల నా భార్య, తల్లి నుంచి కూడా ఆగ్రహానికి గురయ్యాను. మరోసారి ఇలా జరగకూడదని భావిస్తున్నా’’ అని కార్తీక్‌ మూడో వన్డే సందర్భంగా కామెంట్రీ బాక్స్‌లోనే బహిరంగ క్షమాపణలు చెప్పాడు. కాగా, డీకే రెండో వన్డే సందర్భంగా కామెంట్రీ చేస్తూ.. ‘‘బ్యాట్స్‌మెన్, బ్యాట్లను ఇష్టపడకపోవడమనేది రెండు వేర్వేరు విషయాలు కావు. చాలామంది బ్యాట్స్‌మెన్‌ తమ బ్యాట్లను ఇష్టపడ్డట్లు కనిపించరు. వాళ్లు ఇతర ఆటగాళ్ల బ్యాట్లను ఇష్టపడతారు. బ్యాట్లనేవి చుట్టుపక్కల ఉండే పరాయి పురుషుల భార్యల్లాంటివి. అవెప్పుడూ సౌకర్యవంతంగా ఉంటాయి’’ అని వ్యాఖ్యానించాడు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని