WTC Final: క్రికెట్‌లోని మరో కోణం చూడటానికి..! 

తాజా వార్తలు

Updated : 27/06/2021 14:08 IST

WTC Final: క్రికెట్‌లోని మరో కోణం చూడటానికి..! 

ఈ ప్రయాణాన్ని మొదలెట్టాను: దినేశ్‌ కార్తీక్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా వెటరన్‌ క్రికెటర్‌ దినేశ్‌ కార్తీక్‌ ఇటీవల జరిగిన ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో క్రికెట్‌ వ్యాఖ్యాతగా మారి అందరినీ అలరించిన సంగతి తెలిసిందే. దిగ్గజ బ్యాట్స్‌మన్‌ సునీల్‌ గావస్కర్‌ సరసన కూర్చొని తన గొంతుని వినిపించాడు. అయితే, కొత్తగా ఈ ప్రయాణం మొదలు పెట్టడానికి గల కారణాలను డీకే తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌ పోస్టులో వెల్లడించాడు.

‘వ్యాఖ్యాతగా మారడం అనేది నేను మాటల్లో వర్ణించలేను. క్రికెట్‌లోని మరో కోణాన్ని చూడటానికే నేనీ ప్రయాణాన్ని మొదలెట్టాను. మీ నుంచి వచ్చిన ప్రేమాభిమానాలు, మద్ధతు ఈ ప్రయాణాన్ని మరింత ఉన్నతంగా మార్చాయి. మీరంటే నాకెంతో ఇష్టం’ అని పేర్కొంటూ డీకే ఓ వీడియో పంచుకున్నాడు. అందులో క్రికెట్‌ వ్యాఖ్యాతగా సాగిన ఆరు రోజుల తన ప్రయాణాన్ని చూపించాడు.

డీకే 2019 వన్డే ప్రపంచకప్‌లో చివరిసారి ఆడాడు. న్యూజిలాండ్‌తో ఆడిన సెమీఫైనల్లో విఫలమైన అతడు 6 పరుగులు చేశాడు. దాంతో అప్పటి నుంచి టీమ్‌ఇండియా డీకేను తుది జట్టులోకి తీసుకోలేదు. అయితే, ఈ ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్‌లో చోటు కోసం ప్రయత్నిస్తున్నాడు.



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని