భారీ అంచనాలతో.. అతడిని ఒత్తిడికి గురి చేయొద్దు: మాజీ క్రికెటర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌

తాజా వార్తలు

Published : 09/09/2021 01:37 IST

భారీ అంచనాలతో.. అతడిని ఒత్తిడికి గురి చేయొద్దు: మాజీ క్రికెటర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌

ఇంటర్నెట్‌ డెస్కు : ఇటీవల ముగిసిన ఓవల్‌ టెస్టులో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న యువ ఆల్‌ రౌండర్‌ శార్థూల్‌ ఠాకూర్‌పై భారీ అంచనాలు పెట్టుకుని.. అతడిని ఒత్తిడికి గురి చేయొద్దని మాజీ క్రికెటర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ సూచించాడు. ‘అంతర్జాతీయ కెరీర్‌ను శార్థూల్‌ ఠాకూర్‌ చాలా గొప్పగా ప్రారంభించాడు. ఓవల్‌ టెస్టులో రెండు అర్ధ శతకాలు, రెండు కీలక వికెట్లు పడగొట్టి ఆకట్టుకున్నాడు. అయితే, అప్పుడే అతడిపై ఓ అంచనాకు వచ్చి మేటి ఆల్ రౌండర్‌గా ముద్ర వేసి ఒత్తిడి పెంచొద్దు. జట్టులో కుదురుకుని నిలకడైన ప్రదర్శన చేసేందుకు అతడికి కొంత సమయం ఇవ్వాలి. ఈ తరం క్రికెట్‌కి ఎనిమిదో స్థానంలో బ్యాట్‌తో రాణించి జట్టును విజయతీరాలకు చేర్చే మేటి ఆల్‌ రౌండర్ల అవసరం చాలా ఉంది. ఆ స్థానంలో ఆడేందుకు శార్థూల్ సరిగ్గా సరిపోతాడు. ప్రస్తుతానికి మరి కొన్ని మ్యాచుల్లో అతడిని ఎనిమిదో స్థానంలోనే ఆడిస్తూ.. బాగా రాణించేందుకు సహకరించాలి’ అని ఇర్ఫాన్‌ పఠాన్‌ పేర్కొన్నాడు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని