క్రికెట్‌ చూడదు.. సచిన్‌, విరాట్‌ అంటే గౌరవం

తాజా వార్తలు

Published : 02/04/2021 01:56 IST

క్రికెట్‌ చూడదు.. సచిన్‌, విరాట్‌ అంటే గౌరవం

ఊర్వశి రౌటెలా జవాబు

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలీవుడ్‌ నటీమణి ఊర్వశి రౌటెలా ఎక్కువగా క్రికెట్‌ను వీక్షించనని అంటోంది. కాబట్టి తనకు క్రికెటర్ల గురించి పెద్దగా తెలియదని చెబుతోంది. అయితే సచిన్‌, విరాట్‌ కోహ్లీ అంటే మాత్రం అమితమైన గౌరవం అని తెలిపింది. ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఆమె జవాబులిచ్చింది.

ఏడాది క్రితం టీమ్‌ఇండియా క్రికెటర్‌ రిషభ్ పంత్‌తో కలిసి ఊర్వశి రౌటెలా భోజనం చేస్తున్న చిత్రాలు ఇంటర్నెట్లో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. బహుశా ఆమె పంత్‌ ప్రియురాలేమోనని గుసగుసలు బయల్దేరడం గమనార్హం. వాట్సాప్‌లో పంత్‌ ఆమెను బ్లాక్ చేసినట్టూ వార్తలు షికార్లు చేశాయి.

ఈ నేపథ్యంలో ‘మీకు ఇష్టమైన క్రికెటర్‌ ఎవరు?’ అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు ఊర్విశి ఇలా సమాధానం గమనార్హం.  ‘నేను క్రికెట్‌ అసలు చూడను. కాబట్టి నాకు క్రికెటర్ల గురించి ఏమీ తెలియదు. సచిన్‌ సర్‌, విరాట్‌ సర్‌ అంటే మాత్రం అమిత గౌరవం’ అని జవాబిచ్చింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని