రిటైర్మెంట్‌ ప్రకటించిన డుప్లెసిస్‌
close

తాజా వార్తలు

Published : 17/02/2021 12:53 IST

రిటైర్మెంట్‌ ప్రకటించిన డుప్లెసిస్‌

ఇంటర్నెట్‌డెస్క్: దక్షిణాఫ్రికా మాజీ సారథి డుప్లెసిస్ సుదీర్ఘ ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. టీ20 ఫార్మాట్‌పై దృష్టిసారించడం కోసం ఈ నిర్ణయాన్ని తీసుకున్నాని తెలిపాడు. అందరికీ కఠినంగా గడిచిన కరోనా కాలంలో తన ఆలోచనలు భిన్నంగా మారాయని అన్నాడు. జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాలని తన హృదయం స్పష్టం చేసిందన్నాడు.

‘‘నా దేశం తరఫున అన్ని ఫార్మాట్లలో ఆడటం ఎంతో గర్వంగా ఉంది. అయితే టెస్టు క్రికెట్‌ నుంచి తప్పుకొనే సమయం ఇప్పుడు ఆసన్నమైంది. వచ్చే రెండేళ్లలో రెండు టీ20 ప్రపంచకప్‌లు ఉన్నాయి. అందుకే పొట్టిఫార్మాట్‌పై దృష్టిసారించాలని భావిస్తున్నా. సాధ్యమైనంత వరకు ఆడుతూ ఉత్తమ ప్రదర్శన చేయాలని ఆశిస్తున్నా’’ అని డుప్లెసిస్‌ అన్నాడు. దక్షిణాఫ్రికా తరఫున ప్రాతినిధ్యం వహిస్తానని, జట్టుకు నాయకుడవుతానని ఊహించలేదని పేర్కొన్నాడు.

36 ఏళ్ల డుప్లెసిస్‌ దక్షిణాఫ్రికా తరఫున 69 టెస్టులు ఆడాడు. 40 సగటుతో 4163 పరుగులు చేశాడు. వీటిలో 10 శతకాలు, 21 అర్ధశతకాలు ఉన్నాయి. గతేడాది అతడు టెస్టు, టీ20ల కెప్టెన్సీ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. అయితే స్వదేశంలో ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌ అనంతరం సుదీర్ఘ ఫార్మాట్‌కు డుప్లెసిస్‌ వీడ్కోలు ప్రకటించాలనుకున్నాడు. కానీ కరోనా భయంతో ఆస్ట్రేలియా పర్యటన రద్దు చేసుకుంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని