Tokyo Olympics: 100 మీటర్ల పరుగులో ఎలెన్‌ థామ్సన్‌ రికార్డు

తాజా వార్తలు

Updated : 31/07/2021 19:40 IST

Tokyo Olympics: 100 మీటర్ల పరుగులో ఎలెన్‌ థామ్సన్‌ రికార్డు

టోక్యో: టోక్యో ఒలింపిక్స్‌లో మరో రికార్డు నమోదైంది. మహిళల 100 మీటర్ల పరుగు పందెంలో ఎలెన్‌ థామ్సన్‌(జమైకా) రికార్డు సృష్టించింది. కేవలం 10.61 సెకన్లలో గమ్యాన్ని చేరుకుని స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. అంతేకాకుండా ఒలింపిక్స్‌ క్రీడల్లో ముఖ్యంగా మహిళల 100 మీటర్ల పరుగు పందెంలో అతితక్కువ సమయంలోనే గమ్యాన్ని చేరుకున్న రెండో అథ్లెట్‌గా రికార్డు నమోదు చేసింది. ఆమెకన్నా ముందు 1988 ఒలింపిక్స్‌లో గ్రిఫిత్‌ జాయ్‌నెర్ 10.49 సెకన్ల 100 మీటర్ల పరుగు పందేన్ని పూర్తి చేయడం ఇప్పటికీ రికార్డే. ఇక థామ్సన్‌ తర్వాతి స్థానంలో రెండుసార్లు ఛాంపియన్‌ అయిన షెల్లీ అన్నా ఫ్రాసెర్‌ను 10.74 సెకన్లతో గమ్యాన్ని చేరుకుని రజతాన్ని, షెరికా జాక్సన్‌ 10.76 సెకన్లతో కాంస్య పతకాలను దక్కించుకున్నారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని