Tokyo Olympics: చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా మహిళా స్విమ్మర్‌!

తాజా వార్తలు

Published : 01/08/2021 14:00 IST

Tokyo Olympics: చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా మహిళా స్విమ్మర్‌!

టోక్యో: ఆస్ట్రేలియాకు చెందిన మహిళా స్విమ్మర్‌ టోక్యో ఒలింపిక్స్‌లో సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఒక ఒలింపిక్స్‌లో అత్యధిక పతకాలు సాధించిన స్విమ్మర్‌గా రికార్డు సృష్టించింది. అలాగే ఒకే ఒలింపిక్స్‌లో ఏడు పతకాలను ముద్దాడిన రెండో మహిళగానూ చరిత్రలోకి ఎక్కారు. గతంలో 1952 ఒలింపిక్స్‌లో రష్యాకు చెందిన జిమ్నాస్ట్‌ మరియా ఘొరొఖోవ్‌స్కాయా ఏడు పతకాలు అందుకుంది. తాజాగా ఆ రికార్డును ఎమ్మా సమం చేసింది.

ఈరోజు జరిగిన మహిళల 4×100 స్విమ్మింగ్‌ రిలే పోటీల్లో ఆస్ట్రేలియా జట్టు విజయం సాధించింది. డిఫెండింగ్‌ ఛాంపియన్ అమెరికాను వెనక్కి నెట్టి 3 నిమిషాల 51.60 సెకన్లలో పూర్తి చేసి సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఈ జట్టులో ఎమ్మా కూడా ఉంది. దీంతో ఆమె పేరిట ఏడు పతకాలు ఖాయమయ్యాయి. ఆమె మొత్తం 4 పసిడి పతకాలు.. మూడు రజత పతకాలు గెలుచుకుంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని