
తాజా వార్తలు
అక్షర్, యాష్ మాయ:ఇంగ్లాండ్ 205 ఆలౌట్
అహ్మదాబాద్: నాలుగో టెస్టులో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. ఆ జట్టు 205 (75.5 ఓవర్లకు) పరుగులకు ఆలౌటైంది. ఈ సారీ ఆ జట్టును టీమ్ఇండియా స్పిన్నర్లు అక్షర్ పటేల్ (4), రవిచంద్రన్ అశ్విన్ (3) ఆడుకున్నారు. తమదైన వైవిధ్యం ప్రదర్శిస్తూ చక్కని స్పిన్‌తో వణికించారు. వారికి తోడుగా మహ్మద్ సిరాజ్ (2) కీలకమైన వికెట్లు పడగొట్టాడు. ఇంగ్లిష్ జట్టులో బెన్‌స్టోక్స్ (55), డేనియెల్ లారెన్స్ (46) టాప్ స్కోరర్లు. జోరూట్ (5) మరోసారి విఫలమయ్యాడు.
Tags :