ఇంగ్లాండ్‌ IPL ఆటగాళ్లు అందులో ఆడరు!
close

తాజా వార్తలు

Published : 15/05/2021 23:05 IST

ఇంగ్లాండ్‌ IPL ఆటగాళ్లు అందులో ఆడరు!

లండన్‌: ఐపీఎల్‌ 14వ సీజన్‌లో ఆడిన పలువురు ఇంగ్లాండ్‌ ఆటగాళ్లు జూన్ 2 నుంచి న్యూజిలాండ్‌తో ప్రారంభమయ్యే రెండు టెస్టుల సిరీస్‌లో ఆడలేరనే వార్తలు వినిపిస్తున్నాయి. క్వారంటైన్‌ నుంచి నేరుగా వారిని టెస్టు క్రికెట్‌లో ఆడించడం ఆ జట్టు యాజమాన్యానికి ఇష్టంలేదని తెలుస్తోంది. ముఖ్యంగా వారికి ఎర్ర బంతితో సరైన ప్రాక్టీస్ లేదనే కారణంగా ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. అదే నిజమైతే జోస్ బట్లర్‌, జానీ బెయిర్‌స్టో, క్రిస్‌వోక్స్‌, సామ్‌కరన్‌, మొయిన్‌ అలీ లాంటి కీలక ఆటగాళ్లు కివీస్‌తో టెస్టు సిరీస్‌కు దూరంకానున్నారు.

ఇటీవల భారత్‌లో నిర్వహించిన ఐపీఎల్‌ 14వ సీజన్‌ కరోనా వైరస్‌ నేపథ్యంలో అర్ధాంతరంగా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. బయోబుడగలో పలువురు ఆటగాళ్లు కరోనా బారిన పడటంతో మిగిలిన మ్యాచ్‌లను వాయిదా వేశారు. దాంతో ఆటగాళ్లంతా తమ ఇళ్లకు చేరుకున్నారు. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్‌కు చేరుకున్న ఆ జట్టు ఆటగాళ్లు ప్రస్తుతం పది రోజుల క్వారంటైన్‌లో ఉన్నారు. ఈ వారంతో ఆ గడువు ముగుస్తుంది. అయితే, భారత్‌ నుంచి తిరిగి వచ్చిన ఆటగాళ్లకు ఆ సమయం సరిపోదని, దాంతో ఓలీ రాబిన్‌సన్‌, క్రేగ్‌ ఓవర్టన్‌, జేమ్స్‌బ్రేసీ లాంటి యువ ఆటగాళ్లను ఎంపిక చేసే అవకాశం ఉందని ఓ అంతర్జాతీయ పత్రిక పేర్కొంది. మరోవైపు ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ లెవెల్స్‌ కాపాడుకున్నా వారికి ఇటీవల ఎర్ర బంతితో తగిన ప్రాక్టీస్ లేదని మరో పత్రిక రాసుకొచ్చింది. దానికి తోడు ఇంగ్లాండ్‌ పురుషుల క్రికెట్‌ మేనేజింగ్ డైరెక్టర్‌ యాష్లీగైల్స్‌ ఇదివరకు మాట్లాడుతూ ఐపీఎల్‌ నుంచి వచ్చిన ఆటగాళ్లు న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌ ఆడరని చెప్పాడు. దాంతో ఆయా ఆటగాళ్లు రాబోయే రెండు టెస్టుల్లో ఆడటం అనుమానాస్పదంగా కనిపిస్తోంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని