టీమ్‌ఇండియాతో తలపడే ఇంగ్లాండ్‌ టీ20 జట్టిదే

తాజా వార్తలు

Published : 11/02/2021 22:32 IST

టీమ్‌ఇండియాతో తలపడే ఇంగ్లాండ్‌ టీ20 జట్టిదే

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీమ్‌ఇండియాతో ఐదు మ్యాచుల టీ20 సిరీసుకు ఇంగ్లాండ్‌ జట్టును ప్రకటించింది. 16 మందితో జట్టును ఎంపిక చేసింది. మరో ఇద్దరు ఆటగాళ్లను రిజర్వుగా ఎంచుకుంది. పొట్టి క్రికెట్‌ సిరీసుకు ఎంపికైన ఆటగాళ్లంతా ఫిబ్రవరి 26న భారత్‌కు బయల్దేరతారు.

ప్రస్తుతం టీమ్‌ఇండియాతో ఇంగ్లాండ్‌ నాలుగు టెస్టుల సిరీసులో తలపడుతోంది. మార్చి 8న సుదీర్ఘ ఫార్మాట్‌ ముగుస్తుంది. మార్చి 12 నుంచి టీ20 సిరీసు మొదలవుతుంది. ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం మొతెరా అన్ని మ్యాచులకు ఆతిథ్యం ఇవ్వనుంది. మార్చి 23 నుంచి మూడు వన్డేల సిరీసు మొదలవుతుంది.

ఇంగ్లాండ్‌ టీ20 జట్టు: ఇయాన్‌ మోర్గాన్‌ (సారథి), మొయిన్‌ అలీ, జోఫ్రా ఆర్చర్‌, జొనాథన్‌ బెయిర్‌స్టో, సామ్‌ బిల్లింగ్స్‌, జోస్‌ బట్లర్‌, సామ్‌ కరన్‌, టామ్‌ కరన్‌, క్రిస్‌ జోర్డాన్‌, లియామ్‌ లివింగ్‌స్టన్‌, డేవిడ్‌ మలన్‌, ఆదిల్‌ రషీద్‌, జేసన్‌ రాయ్‌, బెన్‌ స్టోక్స్‌, రీస్‌ టాప్లె, మార్క్‌ వుడ్‌, జేక్‌ బాల్‌ (రిజర్వు), మాట్‌ పార్కిన్‌సన్‌ (రిజర్వు)

ఇవీ చదవండి
కుల్‌దీప్‌ ఎంపికలో పక్షపాతమా?
ఇదిగో.. ఈ యెటకారాలే వద్దనేది వాన్‌

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని